తెలంగాణ

న్యాయాధికారులకు మధ్యంతర భృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: న్యాయవ్యవస్థలో పని చేసుస్తన్న న్యాయాధికారులకు తక్షణం ఉద్యోగి బేసిక్‌లో పెరిగిన 30 శాతం మధ్యంతర భృతిని 2018 మే నెల నుంచి (తాత్కాలిక) ఇవ్వాలని, అలాగే అరియర్స్ మాత్రం 2016 జనవరి నుంచి అమలు చేయాలని బుధవారం నాడు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయాధికారుల జీత భత్యాలకు సంబంధించిన అంశంపై సమీక్షించాలని సుప్రీం కోర్టు రెండవ జాతీయ న్యాయవ్యవస్థను ( పే కమిషన్‌ను) నియమించిం ది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కోర్టుల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులతో పాటు దిగువస్థాయి అధికారుల జీత భత్యాలపై న్యాయవ్యవస్థ సమీక్షించింది. గత మార్చి 9న న్యాయవ్యవస్థ తమ నివేదికను సుప్రీం కోర్టుకు నివేదించింది. నివేదికలను సమీక్షించిన సుప్రీం కోర్టు బుధవారం దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా పెరిగిన తాత్కాలిక భృతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.