తెలంగాణ

ఈ ఏడాది నుండే వెటర్నరీ అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: వరంగల్ జిల్లా మామునూరులో ప్రతిపాదించిన వెటర్నరీ కాలేజీలో ఈ ఏడాది అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించామని, అందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి తరుణ్ శ్రీ్ధర్‌ను కోరామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. వెటర్నరీ కళాశాలకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించామని, బోధన సిబ్బంది 15 మంది ఉన్నారని, మరో 85 మంది నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. వెంటనే కాలేజీని నడపడానికి 24వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనాన్ని కిరాయికి తీసుకున్నామని అన్నారు. వెటర్నరీ యూనివర్శిటీ ఈ కాలేజీలో ల్యాబ్ పరికరాలు కొనుగోలుచేసేందుకు అనుమతి ఇచ్చిందని, వెంటనే తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కొనుగోలు బాధ్యతలు అప్పగించామని అన్నారు.
కాలేజీకి శాశ్వత భవనం, హాస్టల్ భవనాలకు గత ఏడాది డిసెంబర్ 11న శంకుస్థాపన చేశామని, పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కాలేజీలో భవనాలు, హాస్టళ్లు, ఇతర వౌలిక వసతులకు 208 కోట్ల రూపాయిలు మంజూరుచేసి ఇంతవరకూ 109 కోట్లు విడుదల చేశామని అన్నారు.
నీట్‌లో మెరిసిన గురుకుల విద్యార్థులు
హైదరాబాద్, జూన్ 5: నీట్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారని సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. రాజేంద్రనగర్ ట్రైబల్ వెల్ఫేర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చదువుకున్న జె నవీన్ కుమార్ అఖిల భారత స్థాయిలో 210 ర్యాంకు ఏస్టీ కేటగిరిలో సాధించగా, బి గణేష్ 562, డి సింధు 612 ర్యాంకులను ఎస్టీ కేటగిరిలో సాధించారు. ఇక గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకులానికి చెందిన ఎల్ సాయి కిషోర్ 767 ర్యాంకును, కె విష్ణు 1174 ర్యాంకు, లిఖిత 2014, సుస్మిత 2255 ర్యాంకులను సాధించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో నిరుపేద విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడం వెనుక గురుకుల విద్యావిధానం ఎంతో దోహదం చేసిందని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.