తెలంగాణ

స్వాతంత్య్ర సమరంలో సేవాదళ్ పాత్ర మరువలేనిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ అనుబంధ విభాగం సేవాదళ్ పాత్ర మరువలేనిదని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇంద్రాభవన్‌లో పీసీసీ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన కార్యవర్గం, జిల్లా ముఖ్యుల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధులుగా ఏఐసీసీ సేవాదళ్ చీఫ్ లాల్‌జీ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ అతి కీలకమైన విభాగమని, దేశ మొదటి ప్రధాని నెహ్రూ మొదలుకొని ఎంతోమంది జాతీయ నాయకులు చైర్మన్లుగా ఇందులో పనిచేశారని అన్నారు. ఎంతో క్రమశిక్షణతో దేశంలో నెలకొన్న సమస్యలను విశే్లషించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ దళ్ ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం దేశంలో విచిత్రమైన పాలన సాగుతోందని, ప్రజలను మతపరంగా విభజించి పాలిస్తున్నారని లాల్‌జీ మండిపడ్డారు. వివిధ వర్గాలపై దాడులు పెచ్చుమీరాయని, పెట్రోల్ ధరలకు అడ్డులేకుండా పోయిందన్నారు.
ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ప్రదాని నరేంద్ర మోదీ పూర్తిగా విఫలం అయ్యారని తెలిపారు. సేవాదళ్ గతంలో మాదిరిగా సిద్ధాంతాలపైనే ఆధారపడి క్రియాశీలకంగా పనిచేస్తోందని, సేవాదళ్ డ్రైస్‌కోడ్‌ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, నూతన సాంకేతికతను ఉపయోగించుకునేందుకు యువదళ్‌ను కూడా ఏర్పాటు చేబోతున్నట్టు ప్రకటించారు. దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పాలనపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు దేశవ్యాప్తంగా సేవాదళ్ సమావేశాలను నిర్వహించనున్నామని తెలిపారు.