తెలంగాణ

తెలంగాణ కోసం సీఎం పదవినే త్యాగం చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడమనూరు, జూన్ 5: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశానని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో మంగళవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఆందోళనలను అదుపు చేసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టి అందోళనలను అదుపులోకి తీసుకురావాలని తనను కోరినప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తేనే ముఖ్యమంత్రి పదవి చేపడుతానని సోనియాకు స్పష్టంచేసి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశానని జానా వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవిని చేపడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయన్న ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకున్నానని, తాను ఏనాడు కూడా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పదవుల కోసం పాకులాడలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ పాలనలో జరిగిందే తప్ప నాలుగేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఊరికి కూడా విద్యుత్, రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించిందా అంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం గారడీ మాటలతో ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.