తెలంగాణ

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతవరణాన్ని అందించేడమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చ మార్చలన్న లక్ష్యంతోనే తెలంగాణ హరితహారాన్ని ప్రారంభించామన్నారు. నాలుగవ విడత హరితహారాన్ని జూలైలో ప్రారంభించనున్నట్టు సిఎం ప్రకటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ ప్రాధాన్యతను సిఎం గుర్తు చేసారు. పర్యావరణ పరంగా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రభావం అందరిపై పడుతుందని, దీనిపట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వీలైనంత మేరకు కాలుష్య కారకాలను వాడకుండా అందరూ దృష్టిసారించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పొంచి ఉన్న ముప్పుపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్ ఎంతగా అవసరం ఉన్నా దాని వల్ల తలెత్తే దుష్పరిణామాల విషయంలో ఏమాత్రం ఏమరుపాటు వద్దని సిఎం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే పచ్చదనం, పరిశుభ్రత ప్రాధాన్యతలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందని సిఎం అన్నారు. ప్రజలందరికీ కాలుష్య రహిత వాతావరణం, స్వచ్చమైన నీరు, ఆహారం అందించే కర్తవ్యంతో పని చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ఆకు పచ్చగా మార్చాలన్న లక్ష్యంతోనే తెలంగాణకు హరితహారం ప్రారంభమైందని, గత మూడేళ్లుగా చేసిన కృషికి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. మొక్కల పెంపకం, వాటి రక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి పెంచినప్పుడే మంచి ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న వాటికి తోడుగా రానున్న తరాలకు అవసరమయ్యే విధంగా చెట్లు పెంచాలన్న ఆలోచన ప్రతీ ఒక్కరిలో రావాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే హరితహారం విజయవంతం అవుతుందని, వచ్చే జూలైలో ప్రారంభమయ్యే నాలుగు విడత హరితహారంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనడం పాటు నాటిన ప్రతీ మొక్కా బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని సిఎం పిలుపునిచ్చారు. పచ్చని పర్యావరణ కోసం హరితహారంలో భాగంగా అర్బన్ ఫారెస్ట్ పార్కులు, రహదారి వనాలు (ఎవెన్యూ ప్లాంటేషన్) ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్భన్ ఉద్గారాలను తగ్గించేందుకు దశల వారీగా ఎలక్ట్రికల్ వాహనాలు ప్రవేశ పెట్టబోతున్నామన్నారు. ఇప్పటి వరకు సౌర విద్యుత్‌లో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. అటవీశాఖ అధ్వర్యంలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన చర్యలు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయని సిఎం కేసీఆర్ గుర్తు చేసారు.

రాష్టవ్య్రాప్తంగా హరిత పాఠశాలలు: కడియం
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మొక్కలను విరివిగా నాటాలని, అన్ని స్కూళ్లను హరిత పాఠశాలలుగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆయన పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖల అధికారులను ఆదేశించారు. ప్రైవేటు కళాశాలు సైతం హరిత విప్లవానికి సహకరించాలని అన్నారు. ఈ ఏడాది కూడా మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సమాచారం అందించిందని, కనుక ఆ సమయంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని చెప్పారు. విద్యార్ధులకు పర్యావరణంపై అవగాహన కల్పించాలని, మొక్కల పరిరక్షణ బాధ్యతను కూడా విద్యార్థులకు అప్పగించి ఎప్పటికపుడు పర్యవేక్షణ చేయాలని ఇందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. గ్రీన్ బ్రిగేడ్‌లను ఏర్పాటు చేసి నాటిన మొక్కలను వంద శాతం పరిరక్షించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.