తెలంగాణ

సింగరేణిలో సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించనున్న సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి 10 రోజుల్లో టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థ సిఎండి శ్రీ్ధర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. బుధవారం హైదరాబాద్ సింగరేణి భవనంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ సంస్థకు సలహాదారు కంపెనీ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ( ఇండియా) అధికారులతో చర్చలు జరిపారు. తొలి దశలో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలాని చెప్పారు. ఫేజ్- 1లో నాలుగు ఏరియాల్లో నిర్మాణాలు చేపట్టాలన్నారు. ముందుగా ఇల్లెందులో60 మెగావాట్లు, రామగుండం -3లో 50 మెగావాట్లు, మణుగూరులో 30 మెగావాట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 10 మెగావాట్లు సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఒక్కొక్క మెగావాట్‌కు 5 ఎకరాలు భూమి అవసరమని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్మాణ దారుల నుంచి టెండర్లు ఆహ్వానించాలని సూచించారు. కార్యక్రమంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా డైరెక్టర్ మిశ్రా, శంకర్,సంజయ్ కుమార్, మణుగూరు ఏరియా జిఎం నర్సింహరావు, ఇల్లందు ఏరియా జఎం లక్ష్మీనారాయణ, రామగండం జిఎం సూర్యనారాయణ, సింగరేణి సంస్థ ప్రధాన పౌరసంబంధాల అధికారి జనగాం నాగయ్య, ఎన్‌టిపిపి అధికారులు పాల్గొన్నారు.