తెలంగాణ

మార్కెటింగ్ శాఖలో 200 ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మార్కెటింగ్ శాఖలో 200 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 11 కార్యదర్శి, 27 అసిస్టెంట్ కార్యదర్శి, 80 అసిస్టెంట్ మార్కెట్ సూపర్‌వైజర్, 13 గ్రేడర్, 9 బిల్ క్లర్కు పోస్టులు, 60 జూనియర్ మార్కెట్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చ జండా ఊపింది. ఈ ఉద్యోగాలను టిఎస్‌పిఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
11 నుండి తుది దశ పాలిటెక్నిక్ కౌనె్సలింగ్
పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల కోసం ఈ నెల 11 నుండి సర్ట్ఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. తొలి దశలో దరఖాస్తు చేయని వారు 8వ తేదీ నుండి 11 వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తొలి దశలో కౌనె్సలింగ్‌కు హాజరుకాని వారు 11వ తేదీన సర్ట్ఫికేట్ల పరిశీలనకు రావాలి. వెబ్ ఆప్షన్లను 11, 12 తేదీల్లో నమోదుచేసుకోవాలి, సీట్ల కేటాయింపు 13న జరుగుతుంది. 14,15 తేదీల్లో ఫీజు చెల్లించి, ఆయా కాలేజీలలో 14, 15 తేదీల్లో రిపోర్టు చేయాలని కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
12 నుండి నీట్ కౌనె్సలింగ్
సిబిఎస్‌ఇ నీట్ కౌనె్సలింగ్‌కు తాత్కాలిక తేదీలను ప్రకటించింది. తొలి దశ కౌనె్సలింగ్ జూన్ 12 న మొదలై 24 వరకూ జరుగుతుంది. జూలై 3వ తేదీలోగా వారు చేరాల్సి ఉంటుంది. రెండో దశ కౌనె్సలింగ్ జూలై 6 నుండి 12 వరకూ జరుగుతుంది. వారంతా జూలై 22లోగా చేరాలి. స్లయిడింగ్ వంటివి ఉంటే వారు ఆగస్టు 12 నుండి 22లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు ఆగస్టు 26 చివరి తేదీ.
ఎస్‌వి డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ రాధాకృష్ణారెడ్డి అరెస్టు
నగరానికి చెందిన ఆర్‌కె డిగ్రీ కళాశాలలో ఇతర పరీక్షా కేంద్రాలకు చెందిన 104 మందిని పరీక్ష రాసేందుకు అనుమతించి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన కేసులో సిసిఎస్ పోలీసులు రామాంతపూర్ ఎస్‌వి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాధా కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు.
ఆర్‌కె డిగ్రీ కళాశాలలో మాల్‌ప్రాక్టీస్ అంశం, ఇతర కేంద్రాల విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించినట్లు గుర్తించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల కంట్రోలర్ ప్రొ.కుమార్ మోలుగారమ్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాధాకృష్ణారెడ్డిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సిసిఎస్ డిసిపి అవానాశ్ మహంతి తెలిపారు. ఎస్‌ఐ బి.జగదీశ్వర్ రావు ఈ కేసును విచారించి నిందితుడిని అరెస్టు చేశారు.