తెలంగాణ

సాంకేతిక విద్యాసంస్థలకు అక్రెడిటేషన్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థలు అన్నీ తప్పనిసరి అక్రెడిటేషన్ తీసుకోవాలని, లేకుంటే ఆయా సంస్థల గుర్తింపును రద్దు చేయకతప్పదని యూజీసీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు యూజీసీ కార్యదర్శి డాక్టర్ రజనీష్ జైన్ యూజీసీ ప్రమాణాల అమలుపై ఆదేశాలు జారీచేశారు. ఇపుడిపుడే మొదలైన విద్యాసంస్థలకు అక్రిడిటేషన్ తీసుకునే గడువును నాలుగేళ్లపాటు ఇచ్చారు. 2022 నాటికి అన్ని సంస్థలూ ఎన్‌బిఎ లేదా నాక్ అక్రిడిటేషన్ పొందాల్సి ఉంటుంది. జాతీయ స్థాయి నియంత్రణ మండళ్ల అనుమతి, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నిరభ్యంతర పత్రాలతో పాటు ఆయా విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు పొందిన తర్వాత జాతీయ స్థాయి ప్రమాణాల పర్యవేక్షణ సంస్థలైన ఎన్‌బిఎ, నాక్‌ల అక్రిడిటేషన్‌ను పొందాల్సి ఉంటుంది.
అలాగే మరికొన్ని విద్యాసంస్థలు ఎన్‌సిటిఇ, ఎఐసిటిఇ తదితర సంస్థల గుర్తింపు పొందాలి. ప్రస్తుతం ఉన్న నాసిరకం చదువులను మెరుగుపరిచి కనీసం 50 శాతం మంది విద్యార్థులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందేలా చూడాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. చదువుకొనసాగిస్తున్న సమయంలోనే కనీసం మూడింట రెండొంతుల విద్యార్ధులను సామాజిక ఉపయుక్త కార్యక్రమాల్లో నిమగ్నం చేయాలి. వారు చదువు పూర్తిచేసిన తర్వాత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా కొంతమంది అయినా స్వీయ ఉపాధి, పరిశ్రమలు, సొంత సంస్థలు ఏర్పాటు చేయగలుగుతారు. తద్వారా వారికే గాకుండా మరికొంత మందికి ఉపాధి ఇవ్వగలుగుతారు. బృందంతో పనిచేసే నైపుణ్యాలు, సాంకేతిక నైపుణ్యాలను వికాసాన్ని వారికి అందించాలి. కాలేజీల్లో టీచర్ల కొరత కనీసం 10 శాతానికి మించకుండా ఎప్పటికపుడు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.