తెలంగాణ

టీచర్ల బదిలీలపై గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: టీచర్ల బదిలీల్లో అయోమయం , గందరగోళం కొనసాగుతోంది. బుధవారం నాడు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతోనూ, జాక్టో నేతలతోనూ సుదీర్ఘంగా చర్చించారు. టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబంధించి సీనియర్ అధికారులతోనూ ఉప ముఖ్యమంత్రి చర్చించారు. బదిలీలకు ఆన్‌లైన్ ఉపయోగించాలా? ఆఫ్‌లైన్ ఉపయోగించాలా అనే అంశంతో పాటు 8 సంవత్సరాలు నిండిన వారు తాము పనిచేస్తున్న పాఠశాలల మినహా మిగిలిన స్కూళ్లను ఎంచుకునే వీలుకల్పించారు. బదిలీలను యాజమాన్యాల వారీ మాత్రమే చేపట్టాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. 8 ఏళ్లు నిండని వారు మాత్రం అదే ప్రదేశంలో కొనసాగేలా చూడాలని కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. 7వ తేదీ నుండి మిగిలిన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా జాక్టోలో భాగంగా ఉన్న పిఆర్‌టియు, టిపియుఎస్, టిఎస్‌జిహెచ్‌ఎంఎ, ఎస్‌టియుటిఎస్, టిఎస్‌టిఎఫ్ తదితర సంఘాల నేతలు పలు సూచనలు చేశారు. పాఠశాల విద్యాసంచాలకుడిగా రెగ్యులర్ అధికారిని నియమించాలని అన్నారు. హెడ్మాస్టర్ మొదలు డైరెక్టర్ వరకూ అన్ని పోస్టులనూ ఇన్‌చార్జిలతో నడుపుతున్నారని ఇలా జరిగితే విద్యాసంస్థలు ఎలా నడుస్తాయని వారు ప్రశ్నించారు. 2018, మే 16న జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఏకీకృత సర్వీసు రూల్స్ నిబంధనలపై ఉన్న స్టేటస్‌కోను వెకేట్ చేయించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాదిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని టిటిజాక్ నేతలు పి సరోత్తం రెడ్డి, విష్ణువర్ధనరెడ్డి కోరారు. ప్రస్తుతం జరుగుతున్న సాధారణ బదిలీలతో పాటు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కూడా బదిలీల షెడ్యూలు విడుదల చేయాలని అన్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 17 , 18 ప్రకారం అప్ గ్రేడ్ చేసిన 3534 పండితుల, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను పాఠశాలలకు కేటాయించి ప్రస్తుతం జరగబోయే కౌనె్సలింగ్‌లో చూపాలని కోరారు. పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో అనధికారికంగా ఉపాధ్యాయ పోస్టులను రేషనలైజ్ చేసి తగ్గిస్తున్నారని వారు ఆరోపించారు. అంతర్‌జిల్లా బదిలీలలో స్పౌజ్ , మ్యూచువల్ బదిలీలు ముందుగానే చేపట్టాలని, మొత్తం సమస్యలపై ఉప ముఖ్యమంత్రి నేతలతో ప్రత్యేకంగా చర్చించాలని అన్నారు. వెబ్‌కౌనె్సలింగ్ ద్వారా బదిలీలు చేస్తే ఎక్కువ సంఖ్యలో ఉన్న ఎస్‌జిటిలు వేల సంఖ్యలో ఆప్షన్లు ఇవ్వాల్సి వస్తోందని, భార్యాభర్తల బదిలీల్లో ఇతర జిల్లాల్లో వారి స్పౌస్ పనిచేసినట్టయితే 10 పాయింట్లు కేటాయించి స్పౌస్‌కి వీలైనంత సమీపంగా బదిలీకి అవకాశం కల్పించాలని అన్నారు. కేవలం హైదరాబాద్‌లో మాత్రమే పదోన్నతులు, బదిలీలు జరపాలని, ఇతర జిల్లాల్లో మాత్రం బదిలీలు మాత్రమే జరపాలని కొన్ని జేఏసీలు కోరుతున్నాయని, టిటి జాక్ మాత్రం మొదటి నుండి పదోన్నతులతో కూడిన బదిలీలను రాష్టవ్య్రాప్తంగా జరపాలని కోరుతోందని అన్నారు.

మారిటైమ్ వర్శిటీ ప్రవేశపరీక్షలో గురుకుల విద్యార్థుల ప్రతిభ
హైదరాబాద్, జూన్ 6: చెన్నైలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీ నిర్వహించిన ప్రవేశపరీక్షలో తెలంగాణ గురుకుల విద్యార్థులు 34 మంది అర్హత సాధించడంపై సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. నేవల్ ఆర్కిటెక్చర్, ఓషన్ ఇంజనీరింగ్, మారిటైమ్ సైన్స్, లాజిస్టిక్స్, రిటైలింగ్, ఇ కామర్స్ వంటి కోర్సుల్లో 34 మంది ఎంపిక కాగా వారిలో 15 మంది బాలికలే కావడం గమనార్హం.