తెలంగాణ

హైదరాబాద్‌లో 42 చోట్ల మల్టీలెవల్ పార్కింగ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: హైదరాబాద్ మహానగర పరిధిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండే 42 చోట్ల మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణానికి ఆసక్తి కరబర్చే (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) సంస్థల నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో బిడ్‌లను ఆహ్వానించనున్నట్టు ప్రకటించింది. సచివాలయంలో మంగళవారం మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌రావు, మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తదితర అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలలో మల్టీలెవల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి వచ్చిన ప్రతిపాదనలపై అధ్యయనం చేయించాలని సిఎస్ ఆదేశించారు. కాంప్లెక్స్‌లు నిర్మించే చోట ఆయా ప్రభుత్వ శాఖలు తమ అవసరాలతో పాటు వాణిజ్య, పార్కింగ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ప్రతి పార్కింగ్‌కు ఒక్కో ప్రత్యేకత ఉండే విధంగా అభివృద్ధి చేయాలన్నారు. వాణిజ్య అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్యాకేజీల వారీగా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఆసక్తి వ్యక్తీకరించే సంస్థలను ఆహ్వానించే ముందు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో పేర్కొనాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో వినియోగిస్తున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.
హైదరాబాద్ నగరం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో వౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వంద నుంచి 500 గజాల లోపు స్థలాలను సేకరించి అక్కడ చైన్ పార్కింగ్‌లు ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించారు. న్యూయార్క్ వంటి నగరాలలో పార్కింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుందన్నారు. మొదటి దశలో పార్కింగ్‌ల ఏర్పాటును ప్రభుత్వ స్థలాలలోనే చేపట్టాలని సిఎస్ జోషి సూచించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడుతూ ఢిల్లీలో డిఎల్‌ఎఫ్ ద్వారా స్మార్ట్ పద్ధతిలో పార్కింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించారని వివరించారు.
మల్టీలెవల్ పార్కింగ్‌ల నిర్మాణానికి మెట్రోరైలు సహకారం అందిస్తుందని ఆ సంస్థ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. జర్మనీ, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలలో పార్కింగ్‌ల నిర్మాణంలో అత్యుత్తమ టెక్నాలజీని వాడుతున్నారని వివరించారు.