తెలంగాణ

ఆర్ అండ్ బీలో 102 మంది ఏఈఈలకు నియామక పత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: రోడ్లుభవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా (ఏఈఈ) రిక్రూట్ అయిన 102 మంది అభ్యర్థులకు బుధవారం నియామక పత్రాలు ఇచ్చారు. ఆర్ అండ్ బీ ఇంజనీర్-ఇన్-చీఫ్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలను రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2016 లో 77 మంది ఏఈఈలను 41 మంది ఏఈలను నియమించుకున్నామన్నారు. తాజాగా నియామకం అయిన వారితో కలిపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 210 మందిని నియమించినట్టయిందన్నారు.
బంగారు తెలంగాణ లక్ష్యసాధనలో ఆర్ అండ్ బీ శాఖ పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయంగా ఉందని తుమ్మల తెలిపారు. లక్ష్యాల సాధనలో ఇతర శాఖలతో పోలిస్తే తమ శాఖ మొదటిస్థానంలో నిలుస్తోందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కొత్తగా నియామకం అయిన సిబ్బంది పనిచేయాలని సూచించారు. క్రమశిక్షణారాహిత్యానికి ఎవరైనా పాల్పడితే సహించబోమని మంత్రి హెచ్చరించారు. సిబ్బంది అంతా క్రమశిక్షణతో పనిచేయాలని, పనితనాన్ని మెరుగు పరచుకోవాలని, ఆధునిక నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో శాసనసభ్యులు ఎర్రబల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఈఎన్‌సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.