తెలంగాణ

కిలో బంగారం.. ఎనిమిది ప్లాట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శేరిలింగంపల్లి, జూన్ 7: అవినీతి నిరోధక శాఖ వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. పెద్దపెద్ద భవనాలు, కోట్లు విలువ చేసే ప్లాట్లు, కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టిన హెచ్‌ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ భీమ్‌రావు ఇంటిపై గురువారం ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో రూ.6కోట్ల పై గా విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, భవనాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములు, పలు బ్యాంకుల్లో ఖాతాలను అధికారులు గుర్తించారు. అధికారుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ వద్ద సర్వే నెంబర్లు 322, 323లోని భూమి హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ రోడ్డుగా ఉంది. కాగా మెస్సర్స్ వైజయంత్ డెవలపర్స్ నిర్మాణ సంస్థ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడానికి అనుకూలంగా మాస్టర్ ప్లాన్ రోడ్డులో ఉన్నప్పటికీ హెచ్‌ఎండీఏ డైరెక్టర్ కే.పురుషోత్తం రెడ్డి, బీ.్భమ్‌రావు సాంకేతిక అనుమతినిచ్చారు. ఆర్.వెంకటరమణ, కే.ఎస్.వాసు ల ఫిర్యాదు మేరకు భారత శిక్షాస్మృతి చట్టం 13 (1) (డీ) రెడ్‌విత్ 13 (2) కింద ప్లానింగ్ అధికారులు పురుషోత్తం రెడ్డి, భీమ్‌రావులపై గతంలోనే కేసు నమోదైంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడనే ఆరోపణలపై ఆధారాలు సేకరించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు హెచ్‌ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ బల్లాల భీమ్‌రావు ఇంటిపై గురువారం దాడులకు దిగింది. శేరిలింగంపల్లిలోని ఆదర్శనగర్ రోడ్డు నెంబర్ 1లోని ఇంటి నెంబరు 5-163 భవనంలోకి ఉదయానే్న ఏసీబీ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ నేతృత్వంలో డీఎస్‌పీ సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ రమణ కుమార్, అధికారుల బృందం చేరుకుంది. భీమ్‌రావును అదుపులోకి తీసుకున్న పోలీసుల బృం దం ఇల్లంతా జల్లెడ పట్టింది. అధికారుల సోదాల్లో రూ.8.95 లక్షల నగదు, బ్యాంకులలో రూ.39.48 లక్షల నగదు, ఇంట్లో రూ.6.30 లక్షల విలువ గల వస్తువులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంట్లో రూ.21.64 లక్షల విలువ చేసే ఒకకిలో బంగారు ఆభరణాలు, రూ.35వేల విలువ చేసే ఒక కిలో వెండి వస్తువులు, రూ.30లక్షల విలువ చేసే తా ను నివసిస్తున్న భవనంతో పాటు కామారెడ్డి జిల్లాలో రూ.22 లక్షల విలువ చేసే మరో భవనం, హైదరాబాద్, నగర సమీప ప్రాంతాల్లో రూ.28.45 లక్షల విలువ చేసే ఎనిమిది ప్లాట్లు, రామచంద్రాపురంలో రూ.1.91 లక్షల విలువ చేసే ఒకషాపు, రూ.7.96 లక్షల బీమా పాలసీలు, రూ.11.20 లక్షల మారుతీ ఎస్ క్రాస్ కారు, రూ.1.5 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటారు సైకిల్, రూ.70 వేల గల హోండా కరిజ్మా బైక్‌లను గుర్తించారు. వ్యయసాయ భూమి, పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్టు తెలిసింది. సోదాలు కొనసాగుతుండడంతో మరిన్ని ఆస్తులు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 1987లో శేరిలింగంపల్లి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ భీమ్‌రావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హెచ్‌ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్లు కే.పురుషోత్తం రెడ్డి, బీ.్భమ్‌రావులను అరెస్టు చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరు పరచనున్నట్టు అధికారులు తెలిపారు.