తెలంగాణ

శాట్ అధికారులపై ఉచ్చు బిగిస్తున్న ఏసీబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: నకిలీ స్పోర్ట్స్ సర్ట్ఫికెట్లతో మెడికల్ సీట్లను లక్షల్లో అమ్ముకున్న కేసులో ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. అక్రమంగా 12 మంది నకిలీ సర్ట్ఫికెట్లతో మెడికల్ సీట్లు పొందిన సంగతి వెల్లడి కావడంతో అసలు సిసలు స్పోర్ట్స్ కోటాలో సీట్లకు అర్హులైన విద్యార్థులు చాలామంది ముందుకు వస్తున్నారు. వారంతా ఏసీబీ అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇలాంటి అక్రమార్కుల వల్ల తమ భవిష్యత్ నాశనమైందని వాపోయారు. ఏసీబీ అధికారులు ఈ కేసులో బుధవారం కుంభకోణంలో కీలక సూత్రధారి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) డిప్యూటీ డైరక్టర్ వెంకటరమణను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో స్పోర్ట్స్ కమిటీలోని మరికొందరు అధికారుల నివాసాల్లో సోదాలు విస్తృంగా చేపట్టారు. వీరి స్టేట్‌మెంట్లను రికార్డు చేసిన ఏసీబీ బృందాలు వారి బ్యాంకు లావాదేవీలు, మొబైల్ కాల్ డేటా వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్లు సీజ్ చేసిన పోలీసులు 2017లో జరిగిన ఈ కుంభకోణంపై అప్పట్లో జరిగిన అన్ని లావాదేవీలను లోతుగా పరిశీలిస్తున్నారు.
శాట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదు:
ఎండీ దినకర్ బాబు వెల్లడి
కాగా ఈ కుంభకోణంపై శాట్ ఎండీ దినకర్‌బాబు స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ఎవరో అసోసియేషన్ వాళ్లు చేసిన తప్పుకు అసలు క్రీడాకారులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.