తెలంగాణ

సీఎం కేసీఆర్ మరో సర్వే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 7: సీఎం కేసీఆర్ మరోసారి పార్టీ ఎమ్మెల్యేల పనితీరు.. వారికి లభిస్తున్న ప్రజాదరణపై జరిపించిన సర్వే టీఆర్‌ఎస్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సర్వే లో టీఆర్‌ఎస్‌కు చెందిన 95మంది ఎమ్మెల్యేల్లో 35మంది ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదని తేలినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ పాలన, పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉన్నట్టు ఈ సర్వేలో తేలినట్టు సమాచారం. ప్రజలకు, స్థానిక సంస్థల ప్రజాప్రతిధులకు, పార్టీ మండల, గ్రామనాయకులకు అం దుబాటులో లేకపోవడం, గ్రూపు రాజకీయా లు, అధికారుల పట్ల సరైన ప్రవర్తన లేకపోవడం, అనుచరులకు పెద్దపీట వేయడం వంటి అంశాలు సదరు ఎమ్మెల్యేలు సర్వేలో వెనుకబడటానికి కారణమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం సాధించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు సిట్టింగ్‌ల్లో కొందరిని పక్కన పెట్టవచ్చని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా సర్వేతో వెనుకబడిన ఎమ్మెల్యేలలో నల్లగొండ జిల్లాకు సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో సీపీఐ నుండి టీఆర్‌ఎస్‌లో చేరిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పట్ల వ్యతిరేకత ఉండగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ పట్ల స్వల్ప వ్యతిరేకత సర్వేలో వెల్లడైనట్లుగా తెలుస్తుంది.