తెలంగాణ

టీచర్ల బదిలీల కథ మొదలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీల అసలు కథ శుక్రవారం ప్రారంభం అయ్యింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులతోనూ, అధికారులను సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బదిలీలకు ప్రత్యేక పోర్టల్ ‘ట్రాన్స్‌ఫర్సు డాట్ సిడిఎస్‌ఇ డాట్ తెలంగాణ డాట్ జీవోవీ డాట్ ఇన్ ’ను ప్రారంభించారు. విద్యాశాఖ ప్రత్యేక సిఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్య సంచాలకుడు అద్హర్ సిన్హా, జాయింట్ సెక్రటరీ విజయకుమార్ తదితర సీనియర్ అధికారులతో చర్చించి బదిలీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకత పాటించాలని సూచించారు. బదిలీల వెబ్ పోర్టల్‌లో సమాచారం అప్‌లోడ్ చేసే తీరుతెన్నులు, టీచర్లకు, అటు అధికారులకు మార్గదర్శకాలు, తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలతో పాటు బదిలీలకు స్పష్టమైన షెడ్యూలును కూడా విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు అవకాశం ఇచ్చారని, ఈ ఉద్యోగుల్లో ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్నారని ఉపముఖ్యమంత్రి చెప్పారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు, ప్రభుత్వ, డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్ల బదిలీల సమాచారం ఇందులో ఉందని పేర్కొన్నారు. డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీల్లోని నాన్ టీచింగ్ ఉద్యోగుల బదిలీల సమాచారం కూడా ఇందులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి కేజీబీవీల్లో బదిలీలు చేపట్టడానికి వీలు లేదని, కేజీబీవీలు కేంద్ర ప్రభుత్వ పథకం కింద నడుస్తున్నారని అన్నారు. ఇందులో ఉపాధ్యాయులు రెగ్యులర్ కాలేదని, అందుకే బదిలీలు ఉండవని అన్నారు. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులు రెగ్యులరైజ్ అయ్యారని, వీరి బదిలీలు ఆగస్టులో చేపడతామని చెప్పారు.
షెడ్యూలు
ఆన్‌లైన్ ద్వారా టీచర్లు తమ డాటాను 10వ తేదీలోగా వెబ్‌పోర్టల్‌లో సమర్పించాలి, దాని ప్రింటవుట్ తీసి సంబంధిత డాక్యుమెంట్లతో ఎంఇఓకు కాపీలు అందించాలి. 8వ తేదీ నుండి ఎంఇఓలు వాటిని పరిశీలించి డిఇఓ లేదా ఆర్‌జెడిలకు సమర్పిస్తారు. 10వ తేదీన సమర్పించిన వారి వివరాలను 12వ తేదీలోగా డిఇఓలకు ఎంఇఓలు అందజేస్తారు. ఖాళీల జాబితాలను జూన్ 9న ప్రకటిస్తారు. ఖాళీలపై అభ్యంతరాలుంటే వాటిని 10,11 తేదీల్లో టీచర్లు ఆర్‌జెడి లేదా డిఇఓలకు వివరించాలి.
అభ్యంతరాలను అధికారులు 12న సవరిస్తారు. 9 వ తేదీ నుండి 13వ తేదీలోగా డిఇఓలు, ఆర్‌జేడీలు లిస్టులను ఖరారు చేస్తారు. 14న అర్హుల జాబితాలను రూపొందిస్తారు. దానిపై 15, 16 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరిస్తారు. పాయింట్ల వారీ 19న తుది జాబితాలను ప్రదర్శిస్తారు. 20వ తేదీ నుండి 23 వరకూ వెబ్ ఆప్షన్లను ఇచ్చిన తర్వాత బదిలీల జాబితాలను కమిటీ అనుమతికి 25వ తేదీన అందుబాటులో ఉంచుతారు. అనంతరం 26న బదిలీ ఉత్తర్వులు ఇస్తారు. అయితే ఇందులో చాలా అంశాలున్నాయని, బదిలీలకు ప్రభుత్వం ఇచ్చిన సమయం చాలదని ఉపాధ్యాయ సంఘాల జాక్ నేతలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.