తెలంగాణ

రుణాలపై ఆర్థిక మంత్రి ఈటల సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని, యువత స్వశక్తితో ముందుకు సాగాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. గురువారం సచివాలయంలో స్టాండ్ అప్ ఇండియా, ముద్ర, బీసీ రుణాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాలు ఉన్నత లక్ష్యంతో రూపొందిస్తున్న పథకాల అమలులో బ్యాంకుల తీరుతో ఇబ్బందులు తలెత్తడం విచారకరమని అన్నారు. స్టాండ్ అప్ ఇండియా పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మహిళలకు కోటి రూపాయల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు మంజూ రు చేయాల్సి ఉన్నా చాలా చోట్ల అలా జరగడం లేదని వాపోయారు. స్వశక్తితో ఎదగాలని తాపత్రయ పడుతున్న వారికి రుణాలు అందించే విషయంలో బ్యాంకుల పనితీరు ఇబ్బందికరంగా ఉంటోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణాలపై అవగాహన కల్పించడంలో బ్యాంకులు విఫలం అయ్యాయని తెలిపారు. ఈ విషయంలో బ్యాంకులు చొరవ చూపాలని కోరారు. ముందుగా ప్రజా ప్రతినిధులకు అర్ధం చేయిస్తే వారే చాలా మంది యువతకు రుణాలు వచ్చేలా చూస్తారని అన్నారు. జిల్లాల్లో జరిగే అధికారిక సమీక్షా సమావేశాల్లో ఈ అంశాన్ని అజెండాగా చేర్చాలని అధికారులను కోరారు.
బీసీ రుణాలకు కొత్త పథకం...
రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం కొత్త పథకాన్ని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తోందని మంత్రి తెలిపారు. దీనికి కూడా బ్యాంకర్లు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలన్నారు. రవాణా వాహనాలు, సెలూన్‌లు, లాండ్రీ షాపులు, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలని మంత్రి కోరారు. రైతులు ఉపయోగించే ట్రాక్టర్లకు ప్రభుత్వం సగం సబ్సిడీ ఇస్తున్నా షూరిటీల పేరిట లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయడం మానుకోవాలని సూచించారు.
మత్స్య అభివృద్ధి పథకానికి అర్హులనే ఎంపిక చేయండి : మంత్రి తలసాని
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సమీకృత మత్య్స అభివృద్ధి పథకానికి అర్హులైన వారినే ఎంపిక చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. గురువారం సచివాలయంలో పశుసంవర్ధక, మత్స్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్య్స కమిషనర్ సువర్ణలతో సమీక్షించారు. మత్య్స సొసైటీలో సభ్య త్వం కలిగి 18 సంవత్సరాలు నిండిన మత్స్యకారుడే ఈ పథకానికి అర్హుడని మంత్రి తెలిపారు.