తెలంగాణ

అవినీతి పరులను సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: పోలీస్ శాఖలో అవినీతి పరులను సహించకూడదని భావించిన డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టారు. నెల మామూళ్లు వసూళ్లు, నేరస్తులతో రాజీపడి సొమ్ము చేసుకుంటున్న క్షేత్ర స్థాయి ప్రత్యేక బృందాల సిబ్బంది అవినీతిపై స్పష్టమైన సమాచారాన్ని డీజీపీ సేకరించుకున్న అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలు, కమిషనరేట్ల వారీగా మామూళ్లు వసూలు చేస్తున్న వారి జాబితా తయారు చేసి బదిలీలు చేయాలని సంబంధిత జిల్లా యూనిట్ ఎస్పీ, లేదా కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా మామూళ్ల మత్తులో జోగుతూ, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునే వారు 391 మంది ఉన్నట్లు గుర్తించి ఆ జాబితాను ఆయా అధికారులకు జారీ చేశారు. వీరందరినీ వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. మరోసారి ఇలాంటి అవినీతి పనులు చేసినా, శాఖకు చెడ్డపేరు వచ్చే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరాల నిరోధానికి క్షేత్ర స్ధాయిలో ప్రత్యేకంగా పని చేసే విధంగా ఎస్పీ, డీఎస్పీ, ఏసీపీ, డీసీపీ, కమిషనర్లకు అనుబంధంగా ప్రత్యేక బృందాలు (స్పెషల్ పార్టీ పోలీస్ లేదా ఐడి పార్టీ పోలీస్)ను నియమిస్తారు. వీరంతా తమకు అప్పగించిన పనిని చేయాల్సి ఉంటుంది. వీరిలో హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్సై స్థాయి సిబ్బంది పని చేస్తారు. సివిల్ డ్రెస్‌లోనే విధులు నిర్వహిస్తూ అసాంఘిక శక్తులపై నిఘా, తప్పించుకు తిరిగే నేరగాళ్ల ఆచూకీ కనిపెట్టడం, వారిని పట్టుకుని అరెస్టు చేయడం వంటి విషయాల్లో పై అధికారులకు సహకరించేందుకు ఇలాంటి ప్రత్యేక బృందాలను నియమిస్తారు. ఇక్కడ చెప్పింది ఒకటైతే చేసేది మరొకటి. నేరస్తులతో కుమ్మక్కవడం, అసాంఘిక శక్తులను చూసీ చూడనట్లు వదిలేయడం, ఇందుకు నెలవారీ మామూళ్లు వసూళ్లు, ఇంకా అనేక పద్ధతుల్లో వారితో కుమ్మక్కవడం వంటి చర్యలకు పాల్పడుతుంటారు. అయితే ఇందుకు సంబంధించి అధికారుల అండదండలు కూడా ఉంటాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు క్షేత్ర స్థాయి సిబ్బందినే బలి చేయడం ఏమిటనే విమర్శలు తలెత్తాయి.