తెలంగాణ

తెలంగాణలో వ్యవసాయ విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవం సృష్టిస్తోందని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉత్తరాఖండ్ వ్యవసాయ మంత్రి శుభోద్ ఉనియాల్ గురువారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తెలంగాణ సేంద్రియ విత్తన ధృవీకరణ ఏజెన్సీ కార్యాలయంలో (హాకాభవన్) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయం, అనుబంధ రంగాలపై దృష్టి సారించామన్నారు. ఈ రంగంలో విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రైతులు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాల్లో 16,124 కోట్ల రూపాయలు మాఫీ చేశామని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 1,50,000 కోట్ల రూపాయలతో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. పంటల పెట్టుబడికి రైతులకు ఎకరాకు ఏటారెండు పంటలకు కలిపి ఎనిమిదివేల రూపాయలు ఇస్తున్నామన్నారు. రైతులకు ఐదులక్షల రూపాయల జీవితబీమా కల్పిస్తున్నామని, ఒక్కోరైతుకు 2271 రూపాయలు ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. రాష్ట్రంలో 400 విత్తనోత్పత్తి కంపెనీలు ఉన్నాయని, ఉత్తరాఖండ్‌కు అవసరమైతే విత్తనోత్పత్తిలో సహాయ సహకారాలు అందిస్తామని పోచారం తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ వ్యవసాయ మంత్రి ఉనియాల్‌కు శాలువాకప్పి, మెమొంటో అందచేశారు. ఈ సమావేశంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి, కమిషనర్ డాక్టర్ ఎం.జగన్‌మోహన్, ఉద్యాన కమిషనర్ వెంకట్‌రామిరెడ్డి, తెలంగాణ సేంద్రియ విత్తనాభివృద్ధి ఏజెన్సీ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.