తెలంగాణ

ఏకీకృత సేవలకు సాంకేతికతే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: పోలీసు శాఖలో ఏకీకృత సేవలను అందించడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలక పాత్ర వహిస్తోందని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్ విధానాలు కలిగి ఉండేందుకు పోలీసు సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం చాలా అవసరమని, ఇవన్నీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా సాధ్యపడతాయని ఆయన తెలిపారు. గురువారం నాడిక్కడ జెఎన్‌టియు ఆడిటోరియంలో ‘తెలంగాణ పోలీస్ ఐటి, కమ్యూనికేషన్స్ కోర్ టీం’లతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో డిజిపి పాల్గొని ప్రసంగించారు. పోలీసు శాఖలో ఏకీకృత సేవల అమల్లో సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలి, ఇప్పటి వరకు సాధించిన విజయాలు, భవిష్యత్ నిర్ణయాలపై సుధీర్ఘంగా చర్చించారు. సాధారణ పౌరుడు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా జీవించే క్రమంలో ఆ పౌరుడికి, అధికారికి మధ్య ఉన్న దూరాన్ని ఐటి సేవల ద్వారా తగ్గించవచ్చని అన్నారు. జిల్లాల్లో పోలీస్ యూనిట్ కార్యాలయాల్లో ఐటి సేవలను అద్భుతంగా అందిస్తున్నారని కొనియాడారు. ఐటి కోర్ టీంలో సమర్ధవంతంగా పని చేసిన వారిని గుర్తించి అందుకు అనుగుణంగా నిబంధనలను తయారు చేసి రివార్డులు ఇచ్చే విధంగా చూడాలని టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీ రవిగుప్తాను డిజిపి ఆదేశించారు. టిఎస్ కాప్, ఐటి సెల్, సిసిటివి ప్రాజెక్టు, ఈ-పెట్టీ కేసులు, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, ఈ-చలాన్ తదితరు ఐటి ఆధారిత అప్లికేషన్ల పనితీరుపై కూడా సమగ్రంగా చర్చించారు. నేరాల నిరోధానికి ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందని వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీ రవిగుప్తా, కమ్యూనికేషన్ల విభాగం డీఐజీ శ్రీనివాస్, డిసిపి వెంకటేశ్వరరావు, కమిషనరేట్లలోని ఐటి విభాగం ఇన్‌స్పెక్టర్లు, జిల్లా పోలీసు అధికారులు హాజరయ్యారు.