తెలంగాణ

ఉద్యోగుల బదిలీలకు ప్రత్యేక కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు అవకాశం ఇస్తూ ఇప్పటివరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని జూన్ 15 వరకు తొలగించడంతో బదిలీల ప్రక్రియ ఊపందుకుంది. బదిలీల ప్రక్రియ 2018 మే 25 న ప్రారంభమై జూన్ 15 వరకు కొనసాగించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వివిధశాఖల్లో ఉద్యోగుల బదిలీల కోసం దరఖాస్తులు స్వీకరిస్తూ, ఈ దరఖాస్తులను పరిశీలించి, నియమావళికి అనుకూలంగా ఉన్న దరఖాస్తుదారులను బదిలీ చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమిస్తున్నారు. ఆయా శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల పేర్లతో జీఓలు జారీ అవుతున్నాయి.