తెలంగాణ

జూనియర్ కాలేజీల్లో ఎమ్సెట్ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సైతం జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలకు, రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షలకు విద్యార్థులకు తర్ఫీదు ఇస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ చెప్పారు. ఈ విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తామని, ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలను ఆయన విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈసారి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతా శాతం పెరిగిందని అన్నారు. 2018లో మార్చిలో 2,60,558 మంది అంటే 62.73 శాతం పాస్ కాగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో 39,854 మంది అంటే 62.73 శాతం పాసయ్యారు. ఫస్టియర్‌లో మార్చిలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణత జనరల్ 65 శాతం, వొకేషనల్ 57 శాతం కాగా, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల తర్వాత జనరల్ ఫలితాలు 72.32 శాతానికి, ఒకేషనల్ 70.82 శాతానికి పెరిగాయని చెప్పారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫస్టియర్‌లో జనరల్ అభ్యర్ధులు 2,56,186 మంది హాజరుకాగా, వారిలో ఎ గ్రేడ్‌లో 91,741 మంది, బి గ్రేడ్‌లో 33,452 మంది, సి గ్రేడ్‌లో 22,417 మంది, డి గ్రేడ్‌లో 18361 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఇంప్రూవ్‌మెంట్ అభ్యర్ధులు 1,26,117 మంది కాగా, కొత్తగా పాసైన వారు 39,854 మంది మాత్రమే. మార్చిలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారితో కలుపుకుంటే ఫస్టియర్‌లో మొత్తం 3,00,412 మంది పాసయ్యారు. ఇక సెకండియర్ ఫలితాలను విశే్లషిస్తే 1,42,144 మంది హాజరుకాగా, వారిలో కాంపార్టుమెంటల్‌లో 59,030 మంది పాస్ కాగా, మార్చి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారితో కలుపుకుంటే 3,11,272 మంది అయ్యారు. మార్చిలో 3,95,721 మంది హాజరుకాగా 2,65,360 మంది పాసయ్యారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీతో కలుపుకుంటే 78.65 శాతం పాసయ్యారు.
జిల్లా ఇంటర్ విద్యాధికారులకు మార్కుల జాబితాలను పంపించామని, 16వ తేదీన సంబంధిత ప్రిన్సిపాల్స్ వద్ద వాటిని పొందాలని బోర్డు కార్యదర్శి చెప్పారు. మార్కుల జాబితాల్లో ఏమైనా పొరపాట్లు పడితే వాటిని జూలై 8వ తేదీలోగా సవరించుకోవాలని అన్నారు. అభ్యర్ధులు సిజిజి వెబ్‌పోర్టల్‌లో లాగిన్ అయి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేయవచ్చని చెప్పారు. ఇందుకోసం తమ అభ్యర్థనలను 11వ తేదీ నుండి 18వ తేదీ వరకూ సమర్పించాలని చెప్పారు.
ఫస్టియర్‌లో మేడ్చెల్ జిల్లా 79 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలవగా, రంగారెడ్డి 76 శాతంతోనూ, ఆదిలాబాద్ 72 శాతంతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. 71 శాతంతో ఖమ్మం నాలుగో స్థానంలో ఉంది.