తెలంగాణ

నేడు పాల్వాయి విగ్రహావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండూరు, జూన్ 8: దివంగత మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ప్రథమ వర్ధంతి, విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నేడు శనివారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి స్రవంతిరెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి విగ్రహావిష్కరణ అనంతరం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ నాయకులు కొప్పుల రాజు, వయలార్ రవి, మల్లు రవి, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, కాంగ్రెస్ శాసనమండలి నేత షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌లు హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు.
ఈ బహిరంగ సభలో పాల్వాయి జీవిత చరిత్ర, ఆయన రాజకీయ ప్రస్థానంపై ఒక సంపుటికను ఆవిష్కరించనున్నట్లు ఆమె తెలిపారు. దివంగత నేత పాల్వాయి వర్ధంతి కార్యక్రమానికి పార్టీలకతీతంగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై నివాళులర్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో చండూరు కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న ధర్మేందర్, సర్పంచ్ పారిజాత జనార్ధన్, కాంగ్రెస్ నాయకులు తేలుకుంట్ల జానయ్య, ఐతరాజు మల్లేష్, ఎం.సంజయ్, కార్యకర్తలు పాల్గొన్నారు.