తెలంగాణ

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. రెండు రోజుల కిందట గవర్నర్ ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. గవర్నర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో సిఎం కేసీఆర్ ఆయన్ను కలిసి అక్కడి విషయాలపై ఆరా తీసినట్టు సమాచారం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలువడానికి ఇటీవల సిఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పటికీ ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడంతో కలువలేకపోయారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీకి వెళ్లిన సందర్భం గా ప్రధానిని కలువడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ కు వచ్చిన విషయాలపై సిఎం ఆరా తీసినట్టు సమాచారం. రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరిస్తూ మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. జోనల్ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణకు కేంద్ర హోంశాఖ ఆమోదించాక చివరగా రాష్టప్రతి ఆమోదించాల్సి ఉంది. ఈ విషయంలో ప్రధాని చొరవ తీసుకొని త్వరగా రాష్టప్రతి ఆమోదం పొందేలా చూడాలని కోరడానికి సిఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అయితే ప్రధాని విదేశీ పర్యటన వల్ల సిఎం కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్ లభించలేదు. ఆ తర్వాత గవర్నర్ ఢిల్లీ వెళ్లడంతో ఈ అంశాన్ని ప్రధాని, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా సిఎం కోరినట్టు తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ వెళ్లివచ్చిన సందర్భంగా అక్కడి విషయాలపై ఆరా తీయడానికే సిఎం కేసీఆర్ ఆయన్ను కలిసినట్టు సమాచారం.