తెలంగాణ

ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో యుజి కోర్సులో తొలి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం నాడు పూర్తయింది. ఇంజనీరింగ్, బి ఫార్మసీ, ఫార్మా డీ కోర్సులను ఆఫర్ చేస్తున్న 267 కాలేజీల్లో 67,325 సీట్లు ఉండగా, వాటిలో 52,774 సీట్లు భర్తీ అయ్యాయి. 14,551 సీట్లు మిగిలిపోయాయి. 14 యూనివర్శిటీ , 67 ప్రైవేటు కాలేజీల్లో నూరు శాతం అడ్మిషన్లు జరగ్గా, ఒక కాలేజీలో సున్నా అడ్మిషన్లు జరిగాయి. రెండు కాలేజీల్లో 5లోపు అడ్మిషన్లు జరగ్గా, 50లోపు అడ్మిషన్లు 20 కాలేజీల్లో జరిగాయి. 100లోపు అడ్మిషన్లు 45 కాలేజీల్లో జరిగాయి. ఈ అడ్మిషన్లతో ఆ కాలేజీల నిర్వహణ సాధ్యమయ్యే పనికాదని సాంకేతిక విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
గత నెల 28న ప్రారంభమైన సర్ట్ఫికేట్ల పరిశీలన జూన్ 3 వరకూ జరగ్గా, ఆప్షన్ల ఎంట్రీ మే 28 నుండి జూన్ 5 వరకూ జరిగాయి. ఎమ్సెట్‌లో 96,703 మంది అర్హత సాధించగా, 59,033 మంది సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారు. అందులో 58,048 మంది వెబ్ ఆప్షన్లను నమోదుచేశారు. ఇంజనీరింగ్‌లో 69,946, బి ఫార్మసీలో 2229, ఫార్మా డిలో 150 సహా మొత్తం 67,325 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండగా, ఇంజనీరింగ్‌లో 52,621, బి ఫార్మసీలో 120, ఫార్మా డిలో 33 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా ఇంజనీరింగ్‌లో 12325 సీట్లు ఫార్మసీలో 2109, ఫార్మా డిలో 117 సీట్లు మిగిలిపోయాయి. ఇంజనీరింగ్‌లో 14 యూనివర్శిటీ కాలేజీల్లో 3057 సీట్లకు 3057 సీట్లు భర్తీ అయ్యాయి. 172 ప్రైవేటు కాలేజీల్లో 61889 సీట్లకు 49,564 సీట్లు భర్తీ కాగా 12325 సీట్లు మిగిలాయి.
బి ఫార్మసీ 3 యూనివర్శిటీ కాలేజీల్లోని 80 సీట్లకు 51 భర్తీ అయ్యాయి. మిగిలినవి బైపీసీ అభ్యర్ధులకు ఇస్తారు. 78 బి ఫార్మసీ కాలేజీల్లో 2149 సీట్లకు 91 భర్తీ కాగా 2058 ఖాళీగా ఉన్నాయి. ఫార్మా డీ ఆఫర్ చేస్తున్న 15 కాలేజీల్లో 150 సీట్లకు 33 భర్తీ కాగా 117 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్ధులు తమ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకుని 12వ తేదీలోగా ఫీజును చెల్లించాలి. అభ్యర్ధులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చని సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చేవారి పేర్లు దోస్త్ నుండి తొలగించడం జరుగుతుందని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.