తెలంగాణ

అన్ని ప్రవేశపరీక్షలకు టెస్టింగ్ ఏజెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8:జాతీయ స్థాయిలో వృత్తి సాంకేతిక విద్యా సంస్థలను పర్యవేక్షించేందుకు ఏకీకృత జాతీయ మండలిని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఇప్పట్లో సఫలీకృతం అయ్యేలా లేదు. ప్రధానంగా యూజీసీ, ఎఐసిటిఇలను కలిపి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. అదే విధంగా మిగిలిన జాతీయ స్థాయి పర్యవేక్షణ సంస్థలను సైతం రద్దు చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవాల్యూయేషన్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (హీరా) ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. ఇందుకోసం 40 అంశాల కార్యాచరణ ప్రణాళికను కూడా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. బిల్లును సెప్టెంబర్‌లో పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించింది. ఇందుకు అనుగుణం గా చేయాల్సిన మార్పులు, చేర్పులను సూచించాల్సిందిగా ఇరు సంస్థలనూ ఎంహెచ్‌ఆర్‌డి సూచించింది. అంతకుముందు గత ప్రభుత్వం ఎన్‌సిహెచ్‌ఇఆర్‌ను ఏర్పాటు చేయాలని భావించగా, దానిని రద్దుచేసిన బీజేపీ ప్రభుత్వం ‘హీరా’ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇదంతా తొందరగా జరిగేలా కనిపించకపోవడంతో హీరా ప్రతిపాదనను సైతం కేంద్రం పక్కన పెట్టినట్టు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనతో పాటు జాతీయ టెస్టింగ్ ఏజన్సీ ఏర్పాటు చేయాలనే యోచనను మాత్రం తొందరగా అమలులోకి తేబోతోంది. కార్యాచరణ ప్రకారం వేగంగా అంతా అనుకున్నట్టు జరిగితే ఇంజనీరింగ్ అడ్మిషన్లకు ఇక మీదట జాతీయ ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రాలు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ అడ్మిషన్ల పరీక్ష రద్దవుతుంది. జాతీయ స్థాయిలో ప్రస్తుతం జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇక మీదట రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీల అడ్మిషన్లకు జెఇఇ మెయిన్ ర్యాంకును పరిగణనలోకి తీసుకునే ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతోంది.