తెలంగాణ

దివాలా నియంత్రణకు సీఎంఏ నిపుణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: దేశంలో సిఎంఎలకు బృహత్తరమైన అవకాశాలు ఏర్పడ్డాయని, దేశంలో ఆర్ధిక వ్యవహారాలపై నిఘా పెరిగిన కొద్దీ సిఎంఎల అవసరం పెరిగిందని ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్టు అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (సీఎంఎ) జాతీయ అధ్యక్షుడు సంజయ్ గుప్త పేర్కొన్నారు. కౌన్సిల్ సభ్యులు సుంకర పాపారావు, డాక్టర్ పివిఎస్ జగన్మోహన్‌రావు, జితేంద్రరావులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో ఆర్ధిక లావాదేవీలపై నిఘాతో పాటు నిబంధనలు పెరిగిన నేపథ్యంలో బ్యాంకులను మోసగించకుండా తొలి దశలోనే అడ్డుకట్ట వేసేందుకు సిఎంఎ వాల్యూయేషన్ కోర్సును ప్రారంభించిందని, ఇది సీఎంఎ సహా సిఎలు ఇతర ఆర్ధిక నిపుణులు చేయవచ్చని, బ్యాంకులు రుణాలు ఇచ్చేముందు వారి సర్ట్ఫికేషన్‌ను నిర్బంధం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీనివల్ల వివిధ సంస్థల దివాలాను నివారించడంతో పాటు బ్యాంకు మోసాలకు అడ్డుకట్ట వేయగలుగుతామని అన్నారు. ఐబిబిఐ పర్యవేక్షణలో 50 గంటల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామని, రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 10వేల మందికి ఈ శిక్షణ ఇచ్చే యోజనలో ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రపంచంలోనే సిఎంఎ సంస్థల్లో ఐసిఎఐ రెండోస్థానంలో ఉందని, ప్రపంచంలో తమ కు 12 కేంద్రాలున్నాయని ఇప్పటికే 80వేల మంది సభ్యులు ఇందు లో ఉన్నారని చెప్పారు. 9 లక్షల మంది విద్యార్థులు ఎన్‌రోల్ అయ్యారని, ఐసిఎఐ ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజన్సీని ప్రారంభించాలని నిర్ణయించిందని చెప్పారు. వాల్యూయేషన్ ప్రొఫెషనల్స్‌తో పాటు ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్స్‌ను కూడా తాము తయారుచేస్తామని తెలిపారు. ఐసిఎఐ, ఐసిఎస్‌ఐ, ఐసిడబ్ల్యుఎఐ సంస్థల పర్యవేక్షణలో కాస్ట్ అకౌంటెంట్లను తయారుచేయడం జరుగుతుందని, గతంలో ఉన్న ఐసిడబ్ల్యుఎఐని ప్రస్తుతం ఐసిఎఐగా వ్యవహరిస్తున్నామని, దీనిని ఐసిఎంఎఐగా వ్యవహించాల్సిందిగా కేంద్ర ఆర్ధిక శాఖను కోరినట్టు చెప్పా రు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల దివా లా నివారణకు ప్రత్యే క చట్టాన్ని తీసుకువచ్చిందని, ఈ చట్టం అమలుకు నిపుణులు కావాలని పేర్కొన్నారు.