తెలంగాణ

చట్టాల్లో లొసుగులతో తీర్పుల్లో ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినప్పటికీ న్యాయవ్యవస్థలో మార్పులు లేకపోవడం దురదృష్టకరమని జాతీయ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు, జస్టిస్ రాజేంద్రప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను మనం పాటిస్తున్నందున కేసుల తీర్పులు ఆలస్యం అవుతున్నాయని, దీనికి ప్రధాన కారణం చట్టాల్లో ఉన్న లొసుగులేనని ఆయన ఉద్ఘాటించారు. పాతకాలపు చట్టాలతో సామాన్యుడికి న్యాయం చేయలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత న్యాయవ్యవస్థను అంతా న్యాయపాలిక అంటున్నారని, కాని పరిస్థితులు చూస్తే అన్యాయపాలికగా ఉందని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో దక్షణాది రాష్ట్రాల న్యాయాధికారుల సంఘం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. మున్సిఫ్ కోర్టు నుంచి పైకోర్టులు ఇచ్చే ఆదేశాల కంటే కోర్టుయేతర ఆదేశాలకు దేశంలో ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఒక్క సర్వోన్నత న్యాయస్థానం మినహాయస్తే మిగతా కోర్టుల ఆదేశాలు అమలు చేయడం లేదన్నారు. 45 ఏళ్ళు గడచినా క్రిమినల్ కేసులు పరిష్కారం కాకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. న్యాయాధికారులు ఎదుర్కొంటున్న సర్వీస్ విషయాన్ని చర్చించడానికి సుప్రీం కోర్టు చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఆర్టికల్ 32 అమలుకాకపోవడంతో న్యాయవ్యవస్థలో పదోన్నతులకు అవకాశం లేదని, దీంతో పదోన్నతులు పొందకుండానే పదవీ విరమణ చేయాల్సి వస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం నాలుగేళ్ళు గడచినా న్యాయాధికారులకు పదోన్నతులు లేకపోవడం ఆశ్చర్యం కల్గుతోందని ఆయన అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జడ్జిరవీందర్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయాధికారులపై ఏసీబీ దాడులు చేయడాన్ని తనకు ఆందోళన కల్గించిందని, దీంతో తాను రాజీనామాను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందచేశానని గుర్తు చేశారు. న్యాయాధికారులపై ఎప్పుడైనా ఆరోపణలు వచ్చినప్పడు న్యాయవ్యవస్థ పరిధిలో విచారణ చేపట్టాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ నుంచి న్యాయాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం 2వ జాతీయ జ్యుడీషియల్ పే కమిషన్, చైర్మన్ జస్టిస్ వెంకట్రామిరెడ్డిని కలసి పే కమిషన్‌ను రాష్ట్రాలు తొందరగా అమలకు ఆదేశాలు ఇవ్వాలని తమ వినతి పత్రంలో రాష్ట్రాల న్యాయాధికారుల సంఘం కోరింది.