తెలంగాణ

భారీ వర్షసూచన లేని తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: ప్రజలంతా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవరించి, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్టవ్రైపు వెళ్లాయి. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రుతుపవనాల మూలంగా వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించినప్పటికీ, తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించలేదు. అయితే తెలంగాణలో వాతావరణం చల్లగా మారడమే కాకుండా, చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో బెజ్జంకి (సిద్ధిపేట)లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్‌లో నాలుగు సెంటీమీటర్లు, వనపర్తిలో మూడు సెంటీమీటర్లు, నిర్మల్, చిన్నచింతకుంటలలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇతర ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురిసింది.