తెలంగాణ

పాడి రైతులకు 50శాతం సబ్సిడీతో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: రాష్ట్రంలోని వివిధ డెయిరీలకు పాలను సరఫరా చేస్తున్న పాడి రైతులకు రూ.800 కోట్లతో 50శాతం సబ్సిడీపై పాడిగేదెలను పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణలతో కలిసి మంత్రి మాట్లాడారు. విజయ డెయిరీతో పాటు నల్లగొండ-రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు, కరీంనగర్ డెయిరీలకు పాలుపోసే 2.17 లక్షల మంది రైతులకు యూని ట్ విలువ 80వేలతో సబ్సిడీ గేదెలను అంది స్తామని తెలిపారు. ఇప్పటికే ఈ ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం కూడా చేశారని పేర్కొన్నారు. నిత్యం డెయిరీలకు పాలు సరఫరా చేస్తున్న రైతులను ప్రోత్సహించే నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ఇనె్సంటివ్‌లను అందిస్తోందని, ఈ పథకంలో భాగంగా రైతులకు చెల్లించాల్సిన బకాయిల కోసం రూ.50 కోట్లను విడుదల చేసినట్టు చెప్పారు. అన్ని ప్రభుత్వ సంస్థలు, దేవాలయాల వద్ద విజయ డెయిరీ ఉత్పత్తులు విక్రయించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. కులవృత్తులను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం బృహత్తరమైన పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.