తెలంగాణ

నేడు సింగరేణిలో పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: వివాదాల మధ్య సింగరేణిలో బదిలీల వర్కర్ల నియామక పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. ఒకవైపు జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలు, మరోవైపు సింగరేణి అధికారులు పరీక్షలు జరుపుతామన్న ప్రకటన అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టేసింది. ఆదివారం ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెం కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సింగరేణిలో గిరిజన భూనిర్వాసితులకు ఉద్యోగ అవకాశం కల్పించకుండా బదిలీల వర్కర్ల నియామకం చేపట్టడం సరైంది కాదని ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జాతీయ అధ్యక్షుడు కె నారాయణ అన్నారు.
ఈ విషయమై గత నెల 28 తేదీ న ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ బదిలీల వర్కర్ల నియామకాలు జరపవద్దని కమిషన్‌ను కోరానన్నారు. దీంతో సింగరేణి సీఎండీకి, తెలంగాణ ఇంధన వనరులశాఖ ముఖ్య కార్యదర్శికి కమిషన్ నోటీసులు జారీ చేసిందన్నారు. ఈ విషయాన్ని సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఖమ్మం జిల్లా ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ కన్వీనర్ దిలీప్ వెల్లడించారు.
ఆదివారం జరిగే పరీక్షలను తాము అడ్డుకుంటాలని గిరిజన భూ నిర్వాసితులు సింగరేణి అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. ఆదివారం పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, అభ్యర్థులు వందతులు నమ్మవద్దని, నిర్ణీత సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సింగరేణి పౌరసంబంధాల అధికారి మహేష్ విజ్ఞప్తి చేశారు.