తెలంగాణ

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: ఐఐటి అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు వెలువడనున్నాయి. గత నెలలో జరిగిన మెయిన్స్ పరీక్షలకు 11,35,084 మంది రిజిస్టర్ చేసుకోగా వారిలో అడ్వాన్స్ పరీక్షలకు 2,31,024 మంది అర్హత సాధించారు. అందులో ఒబిసి 65,313 మంది, ఎస్సీ 34425 మంది, ఎస్టీ 17256 మంది, పిడబ్ల్యుడి 2755 మంది హాజరయ్యారు. ఆదివారం నాడు ఫలితాలు ప్రకటించిన తర్వాత అందులో అర్హత సాధించిన వారికి ఐఐటిల్లో సీట్లు దక్కుతాయి. 23 ఐఐటిల్లో 11279 సీట్లు ఉండగా మహిళలకు మరో 800 సూపర్‌న్యూమరీ సీట్లున్నా యి. దేశంలో 23 ఐఐటిలతో పాటు 31 ఎన్‌ఐటిలు, 23 ట్రిపుల్ ఐటిలు, 23 జిఎఫ్‌టిఐలలో వీరికి సీట్లు దక్కుతాయి. తొలి దశ సీట్ల రిజిస్ట్రేషన్ ఈ నెల 19 నుండి మొదలవుతుంది. 24 వరకూ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తారు. ఏడు విడతల్లో అడ్మిషన్ల కౌనె్సలింగ్ జరుగుతుంది. తుది విడత కౌనె్సలింగ్ జూలై 18 నాటికి పూర్తిచేస్తారు. కాగా ఎన్‌ఐటి వరంగల్ 14న జెఇఇ కౌనె్సలింగ్‌పై సదస్సు నిర్వహిస్తోందని డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు తెలిపారు.
టాపర్లు వీరేనా?
ఆదివారం ప్రకటించే టాపర్ల జాబితాల్లో మెయిన్స్ టాపర్లే దాదాపు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. భోగి సూరజ్ కృష్ణ, కేవీఆర్ హేమంత్ కుమార్, పార్దలతూరియా, ప్రణవ్ గోయల్, గట్టు మైత్రేయ, పవన్ గోయ ల్, భాస్కర్ అరుణ్‌గుప్త, దోకరపు భరత్, ఎస్ సింగ్ సలూజా, గోసుల వినాయక్ శ్రీవర్థన్‌లు టాప్ 10లో ఉండే వీలుందని అంచనా.