తెలంగాణ

నాలుగోవిడత హరితహారానికి సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగో విడత హరితహారం జూలై రెండవ వారంలో ప్రారంభించన్నారు. 2015 జూలై 3న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మొదటిసారిగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆనాటి నుంచి ప్రతి ఏడు ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా ప్రభుత్వం నిర్వహిస్తోంది. నానాటికీ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు భావితరాలకు స్వచ్చమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అంతరించి పోతున్న అడవుల వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరినీ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు. హరితహారంలో భాగంగా నాలుగేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2015-16లో 15.86 కోట్ల మొక్కలు, 2016-17లో 31.67 కోట్ల మొక్కలను, 2017-18లో 34.07 కోట్ల మొక్కలను నాటారు. గత ఏడాది విజయవాడ రహదారిపై ఒకే రోజు 163 కిలోమీటర్ల పొడవునా మొక్కలను నాటి రికార్డు సృష్టించారు. కేవలం మొక్కలు నాటి చేతులు దులుపుకోకుండా నాటిన ప్రతి మొక్క సజీవంగా ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొక్కల సంరక్షణ బాధ్యత రెవెన్యూ అధికారులకు అప్పగించారు.
హరితహారినికి సాంకేతికతను జోడించిన ప్రభుత్వం జియో ట్యాగింగ్ ద్వారా ప్రతి మొక్క ను పర్యవేక్షిస్తుండటంతో అద్భుతమైన ఫలితం సాధిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్ రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల్లో 91శాతం జీవించి ఉన్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వానికి చెందిన నిరుపయోగ స్థలాల్లో నాటిన వాటిలో 79శాతం మొక్కలు సజీవంగా ఉన్నట్టు గుర్తించారు. నాలుగో విడత హరితహారం కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 2925 నర్సరీల్లో 42.18 కోట్ల మొక్కలను సిద్ధం చేసింది. ఈ ఏడాది టేకు, వెదురు, పూలు, పండ్ల మొక్కలను అధికంగా నాటాలని నిర్ణయించడంతో అందుకు తగ్గట్టుగా ఆయా మొక్కలను సిద్ధం చేసినట్టు అధికారులు వెల్లడించారు.