తెలంగాణ

రెండో దశలో సీటు వస్తే మొదటి దశ సీటు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,జూన్ 9: ఇంజనీరింగ్ తొలి దశలో సీట్లు పొందిన వారు వెంటనే తమ అలాట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. మొదటి దశ కౌనె్సలింగ్‌లో మంచి సీటు రాని వారు లేదా మంచి కాలేజీలో సీటు రాని వారు ఏం చేయాలనే దానిపై ఇటు తల్లిదండ్రుల్లోనూ, అటు విద్యార్థుల్లోనూ అయోమయం నెలకొనడంతో సాంకేతిక విద్యాశాఖ అధికారులు వివరణ ఇచ్చారు. తొలి దశలో సీటు పొంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, సంబంధిత కాలేజీలో రిపోర్టు చేసిన వారు రెండో దశలో పాల్గొనకపోతే తొలి దశ సీటు కొనసాగుతుంది. ఒక వేళ రెండో దశలో పాల్గొని సీటు పొందితే అదే ఫైనల్ అవుతుందని, రెండో దశ సీటు పొందిన తర్వాత తొలి దశ సీటు రద్దవుతుందని చెప్పారు. ఒక వేళ తొలి దశలో సీటు పొంది రెండో దశలో కూడా వెబ్ కౌనె్సలింగ్‌లో పాల్గొన్నా సీటు పొందని పక్షంలో తొలి దశ సీటు కొనసాగుతుందని తెలిపారు. తొలి దశలో సీటు పొంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, కాలేజీలో రిపోర్టు చేయకపోతే అటువంటి వారు రెండో దశ వెబ్ కౌనె్సలింగ్‌లో పాల్గొనకపోతే తొలి దశ సీటు రద్దవుతుందని, వారు రెండో దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చి, సీటు పొందితే రెండో దశలో పొందిన సీటు మాత్రమే ఖరారవుతుందని, తొలి దశ సీటు రద్దవుతుందని, ఇక వారు రెండో దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చి, సీటు పొందని పక్షంలో తొలి దశ సీటు కూడా రద్దవుతుందని అధికారులు వివరించారు.
సీటు పొంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా, అలా ట్ అయిన కాలేజీకి వెళ్లకుండా ఉన్న అభ్యర్ధులు రెండో దశలో పాల్గొనకపోతే తొలి దశ సీటు రద్దవుతుందని, రెండో దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చి సీటు పొందితే రెండో దశ సీటు మాత్రమే ఖరారవుతుందని, తొలి దశ సీటు రద్దవుతుందని, రెండో దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చి సీటు రాకపోతే తొలి దశ సీటు రద్దవుతుందని పేర్కొన్నారు.
తొలి దశలో సీటు రాకపోయినా లేదా తొలి దశ వెబ్ కౌనె్సలింగ్‌లో పాల్గొనకపోయినా, రెండో దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చినపుడు వారికి రెండో దశలో సీటు వస్తే వారికి రెండో దశలో వచ్చిన సీటు ఖరారవుతుందని అధికారులు వివరించారు.