తెలంగాణ

మోదీ హత్యకు కుట్ర నిజమేనా? -- మాజీ ఎంపీ వి.హనుమంత రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరిగింది నిజమేనా? అనే అనుమానాన్ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంత రావు వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత పెరిగినందున సానుభూతి కోసమే ఇటువంటి ఎత్తుగడ వేశారేమోనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. తాను ఏది చెబితే అదే వేదం అన్నట్టు ఇంతకాలం వ్యవహరించిన మోదీ ఇప్పుడు త్వరలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందునసీనియర్ నాయకులైన ఎల్‌కె అద్వానీ, ఉద్ధవ్ థాకరేతో పాటు నటి మాధురీ దీక్షిత్ దగ్గరకు వెళ్ళారని ఆయన తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి అంశాలపై చర్చించేందుకు వెళ్ళారా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అజ్మీర్ దర్గా వద్ద ముస్లింల కోసం ఒక ఎకరాలో భవనం నిర్మిస్తామని అంటున్నారని ఆయన తెలిపారు. లోగడ అయ్యప్ప భక్తుల కోసం శబరిమలైలో కట్టిస్తామన్న భవనం ఏమైందని ఆయన ప్రశ్నించారు. ముస్లింలకు ఒక్క రోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం కాదు, వారు జీవితంలో ఆర్థికంగా స్థిరపడేలా చూడాలని విహెచ్ డిమాండ్ చేశారు.