తెలంగాణ

ఎడ్‌సెట్ టాపర్ సుచరిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణలోని ఉపాధ్యాయ విద్యా కళాశాలల్లో బి.ఇడి కోర్సులో చేరేందుకు నిర్వహించిన ఎడ్‌సెట్ -2018 ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి బుధవారం నాడు విడుదల చేశారు. సెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం , కన్వీనర్ ప్రొఫెసర్ సి మధుమతి, ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 32, 330 మంది పరీక్షకు హాజరయ్యారు. 30606 మంది అర్హత సాధించారు. 94.67 శాతం మంది అర్హత సాధించారని ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. ఉత్తీర్ణులైన 32330 మంది పరీక్షకు హాజరుకాగా, వారిలో స్ర్తిలు 25,768 మంది కాగా, అందులో పురుషులు 6562 మంది మాత్రమేనని అన్నారు. అర్హత సాధించిన వారిలో స్ర్తిలు 24236 మంది కాగా, పురుషులు 6370 మంది ఉన్నారని వివరించారు. ఐదు సబ్జెక్టుల్లో ఆన్‌లైన్‌లో తొలిసారి పరీక్ష నిర్వహించామని, మాథ్స్‌కు 9077 మందికి 7495 మంది హాజరయ్యారని, 7211 మంది అర్హత సాధించారని, పిఎస్‌లో 2835 మంది రిజిస్టర్ చేసుకోగా, 2317 మంది హాజరయ్యారని, 2175 మంది అర్హత సాధించారని, బయాలజీలో 190479 మందికి 8761 మంది హాజరయ్యారని, 8414 మంది అర్హత సాధించారని, సోషల్‌లో 15421 మందికి 13014 మంది హాజరయ్యారని, 12074 మంది అర్హత సాధించారని, ఇంగ్లీషులో 881 మందికి 743 మంది హాజరయ్యారని, 732 మంది అర్హత సాధించారని ఎడ్‌సెట్‌కు మొత్తం 38693 మంది రిజిస్టర్ చేసుకోగా, 32,330 మంది హాజరయ్యారని, 30604 మంది అర్హత సాధించారని వివరించా రు. మాథ్స్‌లో తొలి మూడు ర్యాంకులు డి సుచరిత, స్రవం తి, వై శ్రావణ్‌కుమార్ సాధించగా, పిఎస్‌లో హఫీ, దీప, మానీష , బయాలజీలో తొలి రెండు ర్యాంకులు నదియానాజ్, అలీఖాన్‌లు, ఎస్‌ఎస్‌లో జి శివశంకరరెడ్డి, బి రఘు, ఇంగ్లీషులో టి వినయ్‌కుమార్, ఎ రిషితలు సాధించారు.

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి
*మార్గదర్శకాలు జారీ చేసిన మున్సిపల్ శాఖ
హైదరాబాద్, జూన్ 13: పట్టణ, నగరపాలిక సంస్థల కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ బుధవారం మార్గదర్శకాలు జారీ చేసారు. పట్టణాలు, నగరాలలో నాణ్యతలేని ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేదించిన విషయం తెలిసిందే. అయితే జిహెచ్‌ఎంసి కార్యాలయంలో మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట తారకరామారావు నిర్వహించిన సమావేశంలో ప్లాస్టిక్ బ్యాటిల్స్, కవర్లను వినియోగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్టవ్య్రాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా రూపొందించిన మార్గదర్శకాలను మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ అన్ని కార్యాలయాల శాఖాధిపతులకు జారీ చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.