తెలంగాణ

ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ, కానిస్టేబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: నగరంలోని హుమయూన్ నగర్ ఎస్‌ఐ సిహెచ్.శ్రీకాంత్, అతనికి సహకరించిన కానిస్టేబుల్ రహీంపాషాలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి చిక్కారు. ఎసిబి అదనపు డిజి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక కేసులో నిందితుడిని వేధించకుండా ఉండేందుకు, బెయిల్ త్వరగా వచ్చేలా సహకరించేందుకు గాను ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.లక్ష డిమాండ్ చేశారు. ఆయుధాల చట్టం కింద ఈ ఏడాది జనవరి 11న అరెస్టు అయిన సాద్ ఆమూది కేసులో ఈ లంచం సొమ్ము డిమాండ్ చేశారు. ఈ నెల 5 నుంచి వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఆమూదీని తీసుకున్న ఎస్‌ఐ విచారణలో వేధించకుండా ఉండేందుకు రూ.50 వేలు డిమాండ్ చేశారు. అంతకు ముందు అరెస్టు చేసే సమయంలోనూ వేధించకుండా ఉండేందుకు రూ.50 వేలు లంచం తీసుకున్నారు. మళ్లీ కస్టడీ సమయంలోనూ రూ.50 వేలు డిమాండ్ చేయడంతో నిందితుడి సోదరుడు ఎట్టకేలకు ఈ నెల 10న మరో రూ.20 వేలు చెల్లించాడు. తర్వాత రోజు 11వ తేదీన రూ.10 వేలు లంచం ఇచ్చుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు మొత్తం రూ.80 వేలు లం చంగా బాధితుడి నుంచి ఎస్‌ఐ వసూలు చేశాడు. అయినప్పటికీ ఎస్‌ఐ సంతృప్తి చెందకుండా మరో రూ.20 వేలు ఇస్తే లక్ష పూర్తవుతుందంటూ ఇవ్వాలని వేధించడం మొదలు పెట్టాడు. దీంతో నిందితుడి సోదరుడు, లంచం ఇచ్చుకున్న బాధితుడు అలీ మహమూద్ ఎసిబిని ఆశ్రయించడం తో బుధవారం వలపన్ని పట్టుకున్నారు. రూ.20 వేలు చెల్లించేందుకు అంగీకరించి ఆ స్టేషన్‌లో పని చేసే కానిస్టేబుల్ రహీంపాషా ద్వారా ఎస్‌ఐ శ్రీకాంత్‌కు అందజేశాడు. వలపన్నిన ఎసిబి అధికారులు రెడ్‌హేండెడ్‌గా వారిని పట్టుకున్నారు.