తెలంగాణ

సరోజినీ కంటి ఆస్పత్రిలో ఐ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్,13 దక్షణ భారత దేశంలో అత్యాధునిక ఐ బ్యాంక్‌ను హైదరాబాద్ సరోజినీ దవాఖానాలోరాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు కోటి రూపాయల ఖర్చు ఐ బ్యాంక్ ఏర్పాటుకు సరోజినీ ఆసుపత్రి యాజమాన్యం ముందుకు రావడం చూస్తే సేవాభావం స్పష్టమవుతోందన్నారు. కొత్త ఎసీ పోస్టు, ఆపరేటీవ్ వార్డు, నేత్రాల సేకరణకు అంబులెన్స్‌ను ఆయన ప్రారంభించారు. గతంలో కార్నియా కలెక్షన్స చేసిన 24 గంటల్లోనే అవసరం అయిన వాళ్ళకు అమర్చేవారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రెండు నెలలు వరకు నిలువ ఉంచేందుకు అవకాశం ఉందన్నారు.ప్రతి నిమిషానికి ఒక శిశువు కంటి చూపు కోల్పోతున్నారని ఆయన ఆందళోన వ్యక్తం చేశారు. మరణించిన వాళ్ళల్లో 2 శాతం నేత్ర దానం ఇస్తే దేశంలో అంధత్వం నివారించవచ్చునని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాపితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సరోజినీ ఆసుపత్రికి ప్రభుత్వ పరంగా సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఖాళీ స్థలాలను పరిశీలించిన అనంతరం ఆసుపత్రికి సంబంధించిన మ్యాప్‌ను సిద్దం చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే జూఫర్ హుస్సేన్, కార్పొరేటర్ అయేషా రుబీనాబేగం, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్ గౌడ్. డాక్టర్ రాజలింగం పాల్గొన్నారు.