తెలంగాణ

మంత్రిని కాదు...మేస్ర్తిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: ‘ప్రాజెక్టులు పూర్తయ్యే వర కు మంత్రిలా కాకుండా పెద్ద మేస్ర్తిలా పని చేస్తా’నని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీ రు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కార్మికుల కొరత ఉం దని అధికారులు తన దృష్టికి తీసుకరాగా, చనాకా- కోరా ట నుంచి తానే కార్మికులను సమకూర్చి మేస్ర్తి లా వ్యవహరించానని మంత్రి గుర్తు చేసారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎక్కడ...ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకవస్తే వెంటనే పరిష్కారిస్తానన్నారు. జలసౌధలో బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్, తమ్మిళ్ల, నెట్టంపాడు ప్రాజెక్టుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమీ క్షా సమావేశం నిర్వహించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసి ఆగస్టు 15కల్లా రాజోలి బండా డైవర్షన్ స్కీమ్‌కు (ఆర్డీఎస్) నీళ్లు అందించాలని మంత్రి ఆదేశించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతలకు సం బంధించిన పంపు లు చైనా నుంచి రావాల్సి ఉండటం తో జాప్యం జరిగే అవకాశం ఉందని అధికారు లు వివరించారు. జాప్యం జరుగకుండా ఎయిర్ కార్గో ద్వారా తెప్పించాలని మంత్రి ఆదేశించారు.