తెలంగాణ

బోనాలకు ఘనంగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలతో పాటు రాష్టవ్య్రాప్తంగా జరిగే బోనాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సచివాలయలో బోనాల జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి పద్మారావు గౌడ్, కార్పొరేటర్లు అరుణ, ఆకుల రూప, కలెక్టర్ యోగితారాణా, వాటర్‌వర్క్స్ ఎండి దాన కిషోర్, వివిధ శాఖల అధికారులు ఎల్‌ఎస్. చౌహాన్, పద్మజా, రామాకాంత్, నర్సింగరావు తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ ఏడాది అమ్మవారికి ప్రభుత్వం తరుపున బంగారు బోనం సమర్పిస్తున్నట్టు తెలిపారు. సుమారు కోటి రూపాలయ ఖర్చుతో మూడు కిలోల 80గ్రాముల బంగారంతో బోనం తయారు చేయిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంగారు బోనం నమూనాను మంత్రులు ఆవిష్కరించారు. జులై 29న జరిగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. అమ్మవారి బోనాల జాతరకు తెలంగాణ నుంచే కాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరు అవుతారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. బోనాల సందర్భంగా భక్తులకు చిన్నపాటి ఇబ్బందులు సైతం తలెత్తకుండా చూడాలని, ఇందు కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 29న బోనాలు, 30 రంగం నిర్వహించనున్న నేపథ్యంలో ఒక్క రోజు ముందే ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్, పారుశుద్య నిర్వహన, బారికేడ్ల ఏర్పాటు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.