తెలంగాణ

కాంగ్రెసోళ్ల కాలం చెల్లింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నీళ్లిచ్చారా?: మంత్రి ఈటల
చొప్పదండి, ఏప్రిల్ 3: ‘నలభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎస్సారెస్పీ కట్టిండ్రు.. నీళ్లిచ్చారా? పదిహేనేళ్ల పాలనలో పచ్చజెండా ఓడు పత్తా లేకుండా పోయిండు... అందుకే ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలి బతుకు భారమైంది... కొట్లాడి ఉద్యమంతో తెలంగాణ తెచ్చి మూడున్నరేళ్ళలోనే అన్నీ తెస్తుంటే మోకాలడ్డేసి కోర్టుల్లో కేసులు వేస్తే.. అక్కడ గెలిచి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామ’ని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి మండల పరిధిలోని రుక్మాపూర్ గురుకుల పాఠశాల కాంపౌండ్ వాల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శోభ తన సొంత నిధులతో దళితులకు అందించిన డప్పులను పంపిణీ చేశారు. అనంతరం కోటి నిధులతో చేపట్టే ఎస్సీ ఫంక్షన్ హాల్‌కు భూమి పూజ నిర్వహించారు. సమావేశంలో మంత్రికి రైతు గంగారెడ్డి, డైరెక్టర్ శ్రావణ్‌కుమార్‌లు రైతు నాగలిని అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే వర్షాకాలానికి ఇంటింటికీ నీళ్ళు అందిస్తామని తెలిపారు. 40 ఏళ్లలో వారు ఖర్చు చేసింది 800 కోట్లనీ.. తాము ఈ మూడేళ్లలో ఖర్చు చేసింది 25 వేల కోట్లని అన్నారు. గోదారి నీళ్లతో ఆడ బిడ్డల కాళ్లు కడుగుతున్నామని తెలిపారు. అప్పులు తెస్తాం.. అన్నీ ఇస్తాం తప్ప మేము మిద్దెలు, భవంతులు కట్టుకోమని విమర్శించారు. మా ఆరాటం, తపన, యావ అంతా పేదోళ్ళ కడుపులు నింపడమేనని చెప్పారు. ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టామని అన్నారు. ఉత్తర తెలంగాణకు కరీంనగర్ నీళ్ల జంక్షన్‌గా మారనుందని పేర్కొన్నారు.