తెలంగాణ

హన్మంతరావు కుటుంబాన్ని ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: సిద్ధిపేట జిల్లా కొండపాక పత్రికా విలేఖరి హన్మంతరావు కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. గురువారం ఆయన అధికారికంగా ప్రకటన జారీచేస్తూ, జర్నలిస్టులు ధైర్యంగా ఉండాలన్నారు. సమాజంలో అన్నిరకాల సమస్యలను అవగాహన చేసుకునే శక్తి జర్నలిస్టులకు ఉంటుందని, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. హనుమంతరావు భార్య పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడం దిగ్బ్రాంతి కలిగించిందని, ఈ సంఘటన విషాదకరమని పేర్కొన్నారు. హనుమంతరావు ఆత్మహత్య చేసుకోవడం గ్రామీణ విలేఖరుల దుస్థితికి అద్దంపడుతుందన్నారు. ఆర్థిక సమస్యల కారణంగా హనుమంతరావు ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోందన్నారు. ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని రాష్ట్రంలోని జర్నలిస్టులకు నారాయణ విజ్ఞప్తి చేశారు.