తెలంగాణ

హరిత కేంద్రాలుగా పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: హరిత తెలంగాణ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న నాలుగో విడద హరితహారం ఈసారి విద్యాసంస్థలు కేంద్రంగా భారీ ఎత్తున చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. స్వచ్ఛ పాఠశాల -హరిత పాఠశాల నినాదంతో మొదటి తరగతి నండి యూనివర్శిటీ వరకూ ఉన్న విద్యాసంస్థల్లో హరితహారం నిర్వహించాలని, విద్యాశాఖ , అటవీ శాఖ, పంచాయితీరాజ్ సమన్వయంతో ఈపనిచేయాలని సూచించారు. విద్యాసంస్థల్లో హరితహారం అమలుపై ఉప ముఖ్యమంత్రి అద్యక్షతన సచివాలయంలో గురువారం నాడు సమీక్ష జరిగింది.
విద్యాసంస్థల్లో నాలుగో విడత హరితహారాన్ని విజయవంతం చేసేందుకు విద్యాశాఖ పరంగా పూర్తి సహకారం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. స్వచ్ఛ పాఠశాల- హరిత పాఠశాల పేరుతో గత ఏడాది నుండి హరితహారాన్ని పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా అదే పేరుతో హరితహారం నిర్వహిద్దామని అన్నారు. ఒకటో తరగతి నుండి యూనివర్శిటీ వరకూ ఉన్న విద్యాలయాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి బ్లాక్ ప్లాంటేషన్ చేయాలని అన్నారు. జూలైలో జరిగే హరితహారం కార్యక్రమంలో ప్రతి విద్యార్థి, ప్రతి విద్యాసంస్థ పాల్గొనేలా ఆదేశాలు ఇచ్చామని అన్నారు. పచ్చదనం ప్రాముఖ్యతపై కూడా విద్యార్థుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.
పర్యావరణంపై ఇప్పటికే పాఠశాలల్లో సబ్జెక్టు ఉందని, అవసరమైతే దీనిని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఆధ్వ్యరంలో వచ్చే పది రోజుల్లో అన్ని జిల్లాల డిఈఓలు, డిఎఫ్‌ఓలు , పంచాయతీరాజ్ అధికారలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యాలయాల్లో ఖాళీస్థలాలను గుర్తించి, ఆ మేరకు హరితహారం చేపట్టాలని అన్నారు.