తెలంగాణ

‘సార్’ ఆశయాలకు అనుగుణంగా పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణ సాధించుకోవడంతో పాటు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ కోరుకున్నట్టే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, ఇదే ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా జయశంకర్ చరిత్రలో చిరస్మరణీంగా నిలిచిపోతారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో గురవారం జయశంకర్ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆయన విగ్రహానికి మున్సిపల్, ఐటీశాఖ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి ఎంపీలు మల్లారెడ్డి, బిబి పాటిల్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నియామకాలు, నిధుల కోసం జరిగిందన్నారు. దివంగత జయశంకర్ సార్ కలలు కన్నట్టుగానే తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుంటున్నామన్నారు. ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. మన నిధులను మన కోసమే ఖర్చు చేస్తున్నామన్నారు. తెలంగాణ కోసం సుదీర్ఘకాలం పోరాడిన జయశంకర్ సార్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు. తెలంగాణలో ప్రతీ సమస్య జయశంకర్ సార్‌కు తెలుసన్నారు. జయశంకర్ కన్న కలలను కేసీఆర్ బంగారు తెలంగాణ ద్వారా సాకారం చేస్తున్నారని నాయిని నరసింహారెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.