తెలంగాణ

స్మార్ట్ పోలీసింగ్ విధానం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: దేశంలో స్మార్టు పోలీసింగ్ విధానం రావల్సి ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారం అహిర్ పేర్కొన్నారు. అరెస్టు చేసిన వ్యక్తుల వేలిముద్రలు, ఛాయాచిత్రాలు, కొలతలను చట్టబద్ధమైనవిగా చేసే అధికారం కల్పించేందుకు ఖైదీల గుర్తింపు చట్టం 1920ని సవరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నేరస్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల నేరాలను పరిష్కరించడం పోలీసులకు కొత్త సవాలుగా మారిందని అన్నారు. ఫింగర్ ప్రింట్ బ్యూరోక్స్ డైరెక్టర్ల 19వ అఖిల భారత సదస్సు ప్రారంభోత్సవ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత జాతీయ నేర రికార్డుల బ్యూరో కేవలం 11.5 లక్షల ముద్రణ రికార్డుల డేటాబేస్ సామర్థ్యం కలిగి ఉందని దానిని విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. పరిశోధకులు, న్యాయశాస్త్ర నిపుణులు వేలి ముద్రల సాక్ష్యాన్ని నమ్మదగిన ఆధారంగా భావిస్తారని, ఇది ఒక ఖచ్చితమైన సమర్ధవంతమైన ఫోరెన్సిక్ సాధనమని మంత్రి అన్నారు. పోలీసు బలగాలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్న ప్రస్తుత నేర వ్యవస్థను సమర్థంగా ఎదుర్కొనేందుకు స్మార్టు పోలీసింగ్ విధానం ఎంతో అవసరమని చెప్పారు. నేరాల రేటును తగ్గించేందుకు, నేరస్తులను కఠినంగా శిక్షించేందుకు పోలీసు వ్యవస్థ పనిచేయాలని అన్నారు.
నేరాలను పరిష్కరించడానికి అనేక దేశాల్లో వేలి ముద్రలను ప్రత్యేక గుర్తింపుగా ఉపయోగిస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో డైరెక్టర్ ఇష్‌కుమార్ తన స్వాగత ఉపన్యాసంలో పేర్కొన్నారు. క్రైమ్ రికార్డుల భాండాగారం ఎన్సీఆర్బీ తన డేటాబేస్‌ను మరింత విస్తరించాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో 868 గుర్తింపబడని కేసులు స్వయంచాలక వేలి ముద్రల గుర్తింపు వ్యవస్థను ఉపయోగించి పరిష్కరించగలిగినట్టు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ మహేందర్‌రెడ్డి అన్నారు. అఖిల భారత బోర్డు పరీక్షలో ప్రావీణ్యాన్ని ప్రదర్శించిన వేలి ముద్ర నిపుణులకి అజీజ్ ఉల్ హక్ ట్రోఫీని హన్సరాజ్ గంగారాం అహిర్ అందజేశారు. కంపెడియం ఆఫ్ ఫింగర్ ప్రింట్ ఎక్విప్‌మెంట్ -2018 , అవార్డు ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఐడిటింఫికేషన్ అనే రెండు పుస్తకాలను ఈ సందర్భంగా మంత్రి విడుదల చేశారు. మొదటిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న రెండు రోజుల సమావేశంలో వేలి ముద్రణ గుర్తింపు వ్యవస్థలపై, వేలిముద్రణ బ్యూరో ఆధునికీకరణ తదితర అంశాలపై చర్చిస్తారు. కాగా నేరఘటనలను ఛేదించడంలో తెలంగాణ పోలీసు శాఖ పనితీరును కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అభినందించారు.