తెలంగాణ

ఎట్టకేలకు నీట్ కేంద్ర కోటాపై స్పష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీట్ల భర్తీ విషయంలో రాష్ట్రం కేంద్ర జాబితాలో చేరినా, నేటికీ అందుకు సంబంధించిన యూజర్ ఐడి, పాస్‌వర్టులు రాకపోవడంతో ఏర్పడిన గందరగోళం సమసిపోయింది. ఈ అంశాన్ని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ దృష్టికి తీసుకువెళ్లడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో సెంట్రల్ కోటా కేటాయింపునకు వీలుకల్పిస్తూ, అందుకు సంబంధించి చర్యలను ఒకటి రెండు రోజుల్లో తీసుకుంటామని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా మరో పక్క కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్ , బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి గానూ ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు గురువారం నుండి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్-2018లో అర్హత సాధించిన అభ్యర్థులు, యూనివర్శిటీ వెబ్‌సైట్ కేఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని వైద్య విశ్వవిద్యాలయం అధికారులు చెప్పారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 8 గంటల నుండి 26వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. మొత్తం సీట్లలో కొంత మేరకు కాంపెటెంట్ అథారిటీకి 50 శాతం సీట్లు ఎ కేటగిరికి వెళ్తాయి. డెంటల్‌లో 556 సీట్లు ఏ కేటగిరి పరిధిలోకి వస్తాయి. కాంపెటెంట్ పరిధిలోకి 100 సీట్లు వస్తాయి. అలాగే ఎంబిబిఎస్‌లో ఏ కేటగిరి పరిధిలో 1005 ఎంబిబిఎస్ సీట్లు వస్తాయి. ఇక కాంపెటెంట్ అథారిటీ పరిధిలో 1250 ఎంబిబిఎస్ సీట్లు వస్తాయి.
షెడ్యూలు నోటిఫికేషన్‌ను 20వ తేదీన జారీ చేశారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో 21వ తేదీ ఉదయం 8 గంటల నుండి 26వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ స్వీకరిస్తారు. సర్ట్ఫికేట్ల వెరిఫికేషన్ 27వ తేదీ నుండి జరుగుతుంది. తుది మెరిట్ జాబితా ప్రకటన తేలీను ఇంకా ఇవ్వలేదు. క్లాసులు మాత్రం ఆగస్టు 1 నుండి మొదలవుతాయని యూనివర్శిటీ పేర్కొంది.