తెలంగాణ

దానం అవకాశవాది: కనుకుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్ అవకాశవాది అని ఎఐసిసి సభ్యుడు, కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం దానం నాగేందర్‌కు కొత్తేమి కాదని ఆయన శనివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. 2014 ఎన్నికలకు ముందు దానం కాంగ్రెస్‌ను పార్టీ వీడి తెలుగు దేశం పార్టీలో చేరారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, చేసిన తప్పును సరి చేసుకోవడానికి టిడిపికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి తిరిగి వచ్చారని ఆయన తెలిపారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు ఆయన్ను తిప్పికొట్టారని, ఘోరంగా ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు దానం టిఆర్‌ఎస్‌లో చేరినా, అక్కడ ఇమడలేరని, ఎన్నికల్లో పోటీ చేసినా మరోసారి చేదు అనుభవం ఎదురుకాక తప్పదని ఆయన పేర్కొన్నారు. దీంతో దానం మళ్లీ సొంత గూటికి వస్తానని అనక తప్పదని ఆయన తెలిపారు. అప్పుడు పార్టీ నాయకత్వం ఆయనను తిరిగి చేర్చుకోరాదని కనుకుల కోరారు.