తెలంగాణ

వ్యవసాయానికి పెద్ద పీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆరుగాలం శ్రమించి రైతుల పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేందుకు వ్యవసాయ సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన మక్కలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన గురువారం స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు. మొక్కజొన్న పండించిన రైతులు ఓపెన్ మార్కెట్‌లో క్వింటాల్ ధాన్యం 1200 రూపాయలకు విక్రయించి నష్ట పోతున్నారని గుర్తించిన ప్రభుత్వం 1425 రూపాయల మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పౌర సరఫరాల శాఖ అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేవిధంగా చర్యలు తీసుకుంటుందన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎ గ్రేడ్ రకం క్వింటాల్ ధాన్యానికి 1590 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 1540 రూపాయలు మద్దతు ధర చెల్లిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు రోజుల్లో రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ రవీందర్ సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.