తెలంగాణ

ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలని, దీంతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అఖిలపక్ష బృందం నాయకులు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. బుధవారం సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, సిపిఎం (ఎంఎల్) నూడెమోక్రసీ నాయకుడు సాదినేని వెంకటేశ్వర రావు, తెలంగాణ ఇంటి పార్టీ నాయకుడు డి. వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకుడు కె. రవి చంద్ర, ఆర్‌ఎస్‌పి నాయకుడు జె. జానకీ రాములు, సిపిఐ(ఎంఎల్) నాయకుడు భూతం వీరన్న తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. 2014 ఫిబ్రవరి 18న పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు చట్టబద్ధంగా తెలంగాణకు రావాల్సిన ఉక్కు పరిశ్రమపై మాట్లాడకుండా దాట వేస్తున్నదని వారు గవర్నర్‌కు తెలిపారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దీనిని అడ్టుకోవాలని వారు కోరారు.