తెలంగాణ

ఆన్‌లైన్‌లో మైనింగ్ అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: గనులశాఖ నుంచి అనుమతులు ఇక నుంచి ఆన్‌లైన్‌లో పొందవచ్చని గనులశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. గనులశాఖలో అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే అమలు చేస్తోన్న ఆన్‌లైన్ సేవలకు అదనంగా మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకోస్తున్నామన్నారు. బుధవారం సచివాలయంలో గనులశాఖ రూపొందించిన ఆన్‌లైన్ పొర్టల్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని గనులశాఖ ఇప్పటికే బాగా వినియోగించుకుంటుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో గనులు, ఖనిజాల నిల్వలు, ఖనిజాల ఆధారిత పరిశ్రమల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టామన్నారు. తాజాగా గనుల లీజుల అనుమతులను కూడా ఆన్‌లైన్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించామన్నారు. గనుల లీజుల పునరుద్ధరణను కూడా ఆన్‌లైన్ ద్వారానే చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు. గనులు లీజులకు పొందాలనుకునే వారు ఇక నుంచి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా చేసామన్నారు. లీజుకిచ్చిన గనుల విస్తీర్ణాన్ని డిజిటలైజ్ చేసి జియో ట్యాంగింగ్ చేస్తున్నామన్నారు. గనుల తవ్వకాల్లో అక్రమాలను అరికట్టడానికి డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నామని మంత్రి వివరించారు.

నీటి పొదుపు నేటి అవసరం
* అక్టోబర్‌లో అంతర్జాతీయ సమావేశం
* మంత్రి అజ్మీరా చందూలాల్
హైదరాబాద్, జూలై 11: ప్రపంచ వ్యాప్తంగా నీటి అవసరాలు పెరిగిపోతున్నాయని, పెరుగుతున్న జనాభా అవసరాలకు అవసరమైన నీటికోసం ముందస్తుగా ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, 2018 అక్టోబర్ 3 నుండి 6 వరకు హైదరాబాద్ (తాజ్ కృష్ణ హోటల్) లో ‘గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్’ నిర్వహిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహంచే సదస్సుపై బుధవారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించామన్నారు. తాగు అవసరాలు, వ్యవసాయంతోపాటు పరిశ్రమలు తదితర అవసరాలకు నీరు ఎంతో ముఖ్యమైందన్నారు. నీటి కోసం రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య గొడవలు జరిగాయన్నారు. నీటిని సమర్థతగా వినియోగించడంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సదస్సులో అమెరికాతో సహా 20 దేశాలకు చెందిన 500 మంది ప్రపంచ ప్రసిద్ధి వ్యవసాయ ఇంజనీర్లు, జీవ శాస్త్ర విభాగానికి చెందిన ఇంజనీర్లు పాల్గొంటారన్నారు. అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కాబోతుండటం ఆనందకరంగా ఉందని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన శాస్తవ్రేత్త డాక్టర్ ఇంద్రజీత్ చౌబే ఈ సందర్భంగా పేర్కొన్నారు.