తెలంగాణ

బతికుండగానే చంపేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 16: అవును ఇది నిజమే.. ఆయనను బతికుండగానే నగర పాలక సంస్థ అధికారులు చంపేశారు. నిన్న కాదు.. మొన్న కాదు 40 ఏళ్ళ క్రితమే రికార్డుల్లో నమోదు చేశారు. దీనిని రూఢీ చేస్తూ గతేడాది నవంబర్ మాసంలో మరణ ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేసి, కాసులిస్తే బల్దియాలో కాని పని ఉండదని నిరూపించుకున్నారు. ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణల్లో కూరుకుపోగా, కొంతమంది అవినీతి అధికారుల నిర్వాకంతో బల్దియా పరువు బజారున పడేస్తున్నారనేందుకు తాజా సంఘటనే తార్కాణంగా నిలుస్తోందనే వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌లోని అంబేద్కర్ నగర్ నివాసి మహ్మద్ జమాలొద్దిన్ ప్రభుత్వ యునాని ఆస్పత్రిలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మరో నాలుగేళ్ళలో పదవీ విరమణ చేయబోతున్నాడు. అయితే, ఇతడు 28 జనవరి 1977లో మరణించినట్లు, అదే ఏడాది జనవరి 31న రికార్డుల్లో నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం గతేడాది నవంబర్ 3న ఇతని వైరి వర్గానికి నగర పాలక సంస్థ అధికారులు అందించారు. ఓ భూ తగాదా విషయంలో దీనిని వారు కోర్టుకు సమర్పించగా, విషయం బహిర్గతమైంది. దీనిపై బాధితుడు గగ్గోలు పెడుతూ, సోమవారం బల్దియా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. సర్ట్ఫికెట్ జారీ చేసిన వైనంపై నగర పాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ గౌతం రెడ్డిని విచారణాధికారిగా నియమించి, మూడు రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. బాధితుడికి, ఇతరులతో ఉన్న కోర్టు వివాదాల నేపథ్యంలో తప్పుడు రికార్డులు సృష్టించినట్లు అనుమానముందని, ధ్రువీకరణ వాస్తవమని తేలితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, జారీ చేసిన సర్ట్ఫికెట్ రద్దు చేస్తామని కమిషనర్ కె.శశాంక తెలిపారు.